స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టండి.. రైలు ప్రయాణంలో ఆస్వాదించండి
ట్రైన్ జర్నీలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే స్విగ్గీ యాప్‌తో కుదరదు. ఐఆర్‌సీటీసీ యాప్‌లోనే దీనికి ఆప్షన్ ఉంటుంది.
రైలు ప్రయాణం అన్ని విధాలా సౌకర్యం. రిజర్వేషన్ దొరికితే హ్యాపీగా గమ్యానికి చేరుకోవచ్చు. పైగా ప్రయాణ ఖర్చు తక్కువ. ఇన్ని రకాల సౌకర్యాలున్న రైల్లో పెద్ద సమస్య అందులో దొరికే ఫుడ్డే. దూరప్రాంతాలకు ప్రయాణించేవారికి రైల్లో ఆహారం ఎంత దారుణంగా ఉంటుందో తెలుసు. ఈ ఇబ్బందులు తీర్చేందుకు ఐఆర్‌సీటీసీతో జట్టు కట్టింది ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ. ప్రయాణికులు ఆర్డరిస్తే రైలు దగ్గరకే తెచ్చి ఫుడ్ అందించబోతోంది.
ఈ నెల 12 నుంచే షురూ..
ట్రైన్ జర్నీలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే స్విగ్గీ యాప్‌తో కుదరదు. ఐఆర్‌సీటీసీ యాప్‌లోనే దీనికి ఆప్షన్ ఉంటుంది. అందులో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఏ స్టేషన్‌లో కావాలో చెప్పాలి. ఆ స్టేషన్‌కు రైలు వచ్చేసరికి స్విగ్గీ మీకు ఫుడ్ అందిస్తుంది. దీన్ని ఈ నెల 12 నుంచే ప్రారంభించబోతున్నారు.
విశాఖ, విజయవాడ, బెంగళూరు, భువనేశ్వర్
తొలుత విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, భువనేశ్వర్ స్టేషన్లలో స్విగ్గీ సేవలు ప్రారంభమవుతాయి. త్వరలో మరో 59 స్టేషన్లకు విస్తరించబోతున్నారు. అయితే ట్రైన్ దగ్గరకు ఫుడ్ ఆర్డర్‌కు డెలివరీ ఛార్జీలు ఎక్కువ ఉంటాయా, ట్రైన్ లేట్‌గా వస్తే ఫుడ్ డెలివరీలో ఎలాంటి ఇబ్బందులుంటాయి వంటి రియల్‌టైమ్ సమస్యలన్నీ ఈ ప్రోగ్రాం పట్టాలెక్కాకగానీ తెలియకపోవచ్చు.