Telugu Global
National

మార్చ్ 31న ప్రారంభం కానున్న IPL

మార్చి 31న గుజరాత్ అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ పోటీలు మొత్తం 12 వేదికలపై జరగనున్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మే 28న అదే వేదికలో జరుగుతుంది.

మార్చ్ 31న ప్రారంభం కానున్న IPL
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31న ప్రారంభం కాను‍ంది. హెవీవెయిట్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య పోటీతో IPL ప్రారంభం కానుంది.

మార్చి 31న గుజరాత్ అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ పోటీలు మొత్తం 12 వేదికలపై జరగనున్నాయి. టోర్నమెంట్ ఫైనల్ మే 28న అదే వేదికలో జరుగుతుంది.

మొత్తం 12 వేదికల్లో... ‍అహ్మదాబాద్, మొహాలీ, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గౌహతి , ధర్మశాల IPL 2023 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

మార్చి 31 నుండి మే 21 వరకు 12 నగరాల్లో 70 మ్యాచ్‌లు జరుగుతాయి.

డే మ్యాచ్‌లు 3:30 PM కి ప్రారంభమవుతాయి, రాత్రి మ్యాచ్‌లు 7:30 PM కి ప్రారంభమవుతాయి.

ఐపీఎల్ 2023లో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు - ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ గ్రూప్ Aలో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ గ్రూప్ బి లో ఉన్నాయి.

గత ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

First Published:  18 Feb 2023 8:05 AM IST
Next Story