Telugu Global
National

దేశంలో పట్టణ ప్రాంతాల కంటే అధికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ద్రవ్యోల్బణం

డిసెంబరులో 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గ్రామీణ ద్రవ్యోల్బణం అధికంగా నమోదయ్యింద‌ని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఆధారపడే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లతో సహా పెద్ద రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

దేశంలో పట్టణ ప్రాంతాల కంటే అధికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ద్రవ్యోల్బణం
X

దేశంలో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయ్యింది. డిశంబర్, 2022 వినియోగదారుల ధరల సూచిక డేటాను ఉటంకిస్తూ హిందూ బిజినెస్‌లైన్ ఈ విషయాన్ని నివేదించింది.

నివేదిక ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం రెండు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, త్రిపురలో అత్యధికంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణంలో మిజోరం అత్యధికంగా 13.94% వద్ద ఉండగా, త్రిపురలో గరిష్టంగా 10.43% ద్రవ్యోల్బణం నమోదైంది.

డిసెంబరులో 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గ్రామీణ ద్రవ్యోల్బణం అధికంగా నమోదయ్యింద‌ని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఆధారపడే తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లతో సహా పెద్ద రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

గ్రామీణ వినియోగదారుల ధరల సూచిక (CPI)లో ఆహారం, పానీయాలు పెద్ద వాటా ఉండటమే గ్రామీణ రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటానికి ప్రాథమిక కారణం. బనారస్ హిందూ యూనివర్శిటీలోని ఎకనామిక్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మనీషా మల్హోత్రా మాట్లాడుతూ గ్రామీణ వినియోగదారుల ధరల సూచిక ప్రకారం గ్రామీణ ద్రవ్యోల్భణం 54.18%, కాగా పట్టణ ద్రవ్యోల్బణం 36.29% మాత్రమే.

అయితే, భారత జనాభాలో 64% కంటే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నందున గ్రామీణ ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తుంది. అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా ఈ విభాగం ఎక్కువగా ప్రభావితమైంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్ ప్రొఫెసర్, సహ-వ్యవస్థాపకుడు అనిల్ కుమార్ సూద్ మాట్లాడుతూ, “గ్రామీణ ద్రవ్యోల్బణం పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని మేము భావిస్తున్నాము, ఎందుకంటే ధర నిర్ణయించే శక్తి గ్రామీణ కుటుంబాలకు లేదు.''

జనవరి 2022 నుండి, గ్రామీణ రిటైల్ ద్రవ్యోల్బణం దేశంలో పట్టణ ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ హెడ్ మహేష్ వ్యాస్ మాట్లాడుతూ, అసమాన వర్షపాతం వ్యవసాయ‌ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిందని, దీని వల్ల గ్రామీణ నిరుద్యోగం మరింతగా పెరిగిందని చెప్పారు.

దానికి తోడు, పాలు, బిస్కెట్లు, దుస్తులు, పాదరక్షలు,వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల గ్రామీణ కొనుగోలు శక్తిని ప్రభావితం చేసింది.

First Published:  15 Jan 2023 1:49 AM GMT
Next Story