317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై భారత్ విక్టరీ... రికార్డు సృష్టించిన టీమిండియా
ఆదివారం తిరువనంతపురంలో సాధించిన ఈ విజయంతో, టీం ఇండియా మూడు మ్యాచ్ ల ఒన్ డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అంతే కాదు 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఏ జట్టు సాధించని అతిపెద్ద విజయాన్ని సాధించి రికార్డును కూడా నమోదు చేసింది.
మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా భారీ విజయంతో స్వంతం చేసుకుంది. మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయడం, విరాట్ కోహ్లి 166 పరుగులతో అజేయంగా రాణించడంతో,తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో శ్రీలంకపై టీమ్ ఇండియా 317 పరుగుల భారీ విజయాన్ని సాధించింది.
ఆదివారం తిరువనంతపురంలో సాధించిన ఈ విజయంతో, టీం ఇండియా మూడు మ్యాచ్ ల ఒన్ డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అంతే కాదు 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఏ జట్టు సాధించని అతిపెద్ద విజయాన్ని సాధించి రికార్డును కూడా నమోదు చేసింది. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. 2008లో ఐర్లాండ్ జట్టును న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడా రికార్డును టీమిండియా తిరగరాసింది.
మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, విరాట్ కోహ్లీ(166), శుభ్‌మాన్ గిల్ (116)ల భారీ స్కోర్ల తో 390/5 భారీ స్కోరు సాధించింది.రోహిత్ శర్మ 42 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 38 పరుగులు చేశారు. తర్వాత, సిరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, సూర్యకుమార్ ఒకటు వికెట్ తీయడంతో శ్రీలంక 73 పరుగులకే ఆలౌట్ అయింది.