Telugu Global
National

భార‌త్ లో ప్ర‌వేశించిన మంకీపాక్స్‌..కేరళకు అత్యున్నత స్థాయి కేంద్ర బృందం

ఇప్పుడిప్పుడే కోవిడ్ మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకుంటున్న త‌రుణంలో మ‌ళ్ళీ అక్క‌డ‌క్క‌డా కేసులు బ‌య‌ట‌ప‌డ‌డం ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో 'మంకీ పాక్స్ వైర‌స్' అంటూ కొత్త వ్యాధి భార‌త్ లో ప్ర‌వేశించ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది.

భార‌త్ లో ప్ర‌వేశించిన మంకీపాక్స్‌..కేరళకు అత్యున్నత స్థాయి కేంద్ర బృందం
X

ఇప్పుడిప్పుడే కోవిడ్ మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకుంటున్న త‌రుణంలో మ‌ళ్ళీ అక్క‌డ‌క్క‌డా కేసులు బ‌య‌ట‌ప‌డ‌డం ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఇదే స‌మ‌యంలో 'మంకీ పాక్స్ వైర‌స్' అంటూ కొత్త వ్యాధి భార‌త్ లో ప్ర‌వేశించ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది.

క‌రోనా కేసు తొలిసారిగా న‌మోదైన కేర‌ళ‌లోనే ఈ కొత్త వైర‌స్ కేసు నిర్ధార‌ణ అయింది. మూడు రోజుల‌ క్రితం విదేశాల నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తికి మంకీపాక్స్ సోకిన‌ట్టు కేర‌ళ ఆగోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. ఆ వ్య‌క్తి విదేశాల్లో మంకీపాక్స్ సోకిన వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉన్న‌ట్టు తెలిసింద‌న్నారు. విదేశాల నుంచి వ‌చ్చిన వ్య‌క్తి ర‌క్త న‌మూనాల‌ను పుణె వైరాల‌జీ ఇనిస్టిట్యూట్ కు పంపామ‌ని, అత‌నికి పాజిటివ్ గా తేలిన‌ట్టు చెప్పారు. అక్క‌డినుంచి పూర్తి నివేదిక వ‌చ్చిన త‌ర‌వాత పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ని చెప్పారు. 2020, జనవరి 27 న చైనాలోని వుహాన్ నగరం నుంచి తిరిగొచ్చిన కేరళకు చెందిన ఓ మహిళకు కరోనా వైరస్ సోక‌డం ద్వారా తొలిసారి ఆ మ‌హ‌మ్మారి మ‌న దేశంలో ప్ర‌వేశించింది.

కేర‌ళ‌కు ప్ర‌త్యేకంగా కేంద్ర వైద్య బృందం

కేర‌ళ లోని కొల్లాం జిల్లాలో 'మంకీ ఫాక్స్‌' వ్యాధినిర్ధార‌ణ అవ‌డంతో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. రాష్ట్రానికి స‌హ‌క‌రించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉన్నత స్థాయి మల్టీ-డిసిప్లినరీ బృందాన్ని పంపింది. ఈ బృందం రాష్ట్ర ఆరోగ్య శాఖతో సన్నిహితంగా పని చేస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి అవసరమైన స‌ల‌హాలు సూచ‌న‌లు ఇస్తుంది.

"మేము క్షేత్ర స్థాయిలో ప‌రిస్థితుల‌ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాం. వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లయితే రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ వ్యాధి నివార‌ణ కోసం చురుకైన చర్యలు తీసుకుంటున్నాము" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కేరళకు వెళ్లే కేంద్ర బృందంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసి), న్యూఢిల్లీ ఆర్ ఎంఎల్ హాస్పిటల్ నుండి నిపుణులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ అధికారితో పాటు కేరళలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం నుండి నిపుణులు కూడా ఉన్నారు.

First Published:  15 July 2022 10:34 AM IST
Next Story