యువ భారతీయులు తమ మొత్తం ఖర్చులో ఫోన్లు, దుస్తులపై పెడుతున్న ఖర్చు 77 శాతం
భారతదేశంలోని యువకులలో 77 శాతం మంది ఎక్కువ సమయం షార్ట్ వీడియోలను చూస్తున్నారని, 16 శాతం మంది న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లలో, 7 శాతం మంది టెలివిజన్, OTTల్లో తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని నివేదిక పేర్కొంది.
18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయులు ఇప్పుడు మొబైల్ ఫోన్లు, దుస్తులపై అత్యధికంగా (77 శాతం) ఖర్చు చేస్తున్నారు. వారిలో 65 శాతానికి పైగా అలాంటి కొనుగోళ్లకు వ్యక్తిగత నిధులను ఉపయోగిస్తున్నారని ఒక నివేదిక వెల్లడించింది.
దేశంలోని అతిపెద్ద షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన మోజ్ షేర్ చేసిన డేటా ప్రకారం, మిగిలిన వారిలో, 26 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం తీసుకుంటున్నారు. 7 శాతం మంది రుణాలపై ఆధారపడతున్నారు.
భారతదేశంలోని యువకులలో 77 శాతం మంది ఎక్కువ సమయం షార్ట్ వీడియోలను చూస్తున్నారని, 16 శాతం మంది న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లలో, 7 శాతం మంది టెలివిజన్, OTTల్లో తమ సమయాన్ని వెచ్చిస్తున్నారని నివేదిక పేర్కొంది.
యువ భారతీయుల కొనుగోలు నిర్ణయాలు 60 శాతం షార్ట్ వీడియో, సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లు, టెలివిజన్ ద్వారా ప్రభావితమవుతున్నాయి.
ఆఫర్లు, డిస్కౌంట్‌లు సగానికి పైగా యువత కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపే అంశాలలో ఒకటి, ఆ తర్వాత ఉత్పత్తుల విశ్వసనీయత, సౌలభ్యం, ఉచిత షిప్పింగ్ తదితరాలు ప్రభావం చూపిస్తున్నాయి.
"భారతీయ యువత మోజ్‌లో ప్రతిరోజూ 3 మిలియన్ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. మోజ్ ప్లాట్‌ఫారమ్‌లో రోజుకు సగటున 34 నిమిషాలు గడుపుతున్నారు" అని కంపెనీ తెలిపింది.