Telugu Global
National

మోదీ చేతికి సెంగోల్.. విపక్షాల నిరసనల మధ్య రేపే పార్లమెంట్ ప్రారంభం

ఆదివారం జరగబోతున్న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే 20 పార్టీలు ప్రకటించాయి. 19 పార్టీలు ఉమ్మడిగా ఓ బహిరంగ లేఖ కూడా రాశాయి. ఇక 25 పార్టీలు ఈ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని తీర్మానించాయి.

మోదీ చేతికి సెంగోల్.. విపక్షాల నిరసనల మధ్య రేపే పార్లమెంట్ ప్రారంభం
X

కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవం తర్వాత లోక్ సభ ఛాంబర్ లో ఏర్పాటు చేయాలనుకుంటున్న సెంగోల్ (రాజదండం)ని తమిళనాడుకి చెందిన పూజారులు ప్రధాని మోదీకి అందించారు.

చర్చ అంతా సెంగోల్ చుట్టూ..

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడికి గుర్తుగా గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ నుంచి భారత తొలి ప్రధాని నెహ్రూ ఈ రాజదండాన్ని అందుకున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఈ రాజదండాన్ని అలహాబాద్ మ్యూజియంలో ఉంచారు. సెంగోల్ ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోలేదని, దాన్ని ఓ వాకింగ్ స్టిక్ లాగా మ్యూజియంలో పెట్టారని ఆరోపించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. దానికి తాము విముక్తి కలిగిస్తున్నట్టుగా మాట్లాడారు. అసలు అధికార మార్పిడికి గుర్తుగా సెంగోల్ ని ఇచ్చినట్టు ఆధారాలు లేవని కాంగ్రెస్ నేతలంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రం రాజదండాన్ని తెరపైకి తెచ్చింది. లోక్ సభ ఛాంబర్ లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు.


20 పార్టీలు అటు, 25 పార్టీలు ఇటు..

ఆదివారం జరగబోతున్న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే 20 పార్టీలు ప్రకటించాయి. 19 పార్టీలు ఉమ్మడిగా ఓ బహిరంగ లేఖ కూడా రాశాయి. ఇక 25 పార్టీలు ఈ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని తీర్మానించాయి. రాష్ట్రపతికి ఆహ్వానం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని చేపట్టిందనే విమర్శలు వినపడుతున్నా మోదీ మాత్రం తగ్గేది లేదంటున్నారు. ప్రారంభోత్సవానికి రెడీ అయ్యారు.

First Published:  27 May 2023 10:19 PM IST
Next Story