ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్‌ను చేధించిన ఇండియన్ నేవీ
అనుమానాస్పదంగా భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఒక చిన్న షిప్‌ను నేవీ అధికారులు గుర్తించారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కలిసి దాన్ని ముట్టడించి, సోదాలు చేశారు.
అరేబియా సముద్రంలో అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌ను ఇండియన్ నేవీ చేధించింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి గుజరాత్‌లోని పోర్‌బందర్ పోర్ట్‌లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా 3,300 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.
ఐదుగురు పాకిస్తానీల అరెస్ట్
మంగళవారం అనుమానాస్పదంగా భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఒక చిన్న షిప్‌ను నేవీ అధికారులు గుర్తించారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులతో కలిసి దాన్ని ముట్టడించి, సోదాలు చేశారు. ఆ షిప్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తుల నుంచి 3,089 కేజీల చరస్, 158 కేజీల మెథామెఫ్తమైన్, 25 కేజీల మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా పాకిస్తాన్‌కు చెందినవారేనని నేవీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవల కాలంలో ఇదే పెద్ద ఆపరేషన్
ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం ఇదే తొలిసారి అని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రకటించారు. సముద్ర మార్గంలో డ్రగ్స్‌ను ఇండియాలోకి చేరవేసే ముఠాలను నేవీ సహకారంతో పట్టుకుంటున్నామని చెప్పారు.