Telugu Global
National

భారతీయుల్లో దానగుణం ఎక్కువ.... అందులోనూ సౌత్ ఇండియా ముందుంది

భారతీయులు దానాలు ఎక్కువగా చేస్తారని ఓ యూనివర్సిటీ సర్వేలో వెల్లడైంది. అయితే ఉత్తర భారతంలో ఎక్కువగా ధార్మిక కార్యక్రమాలకే దానం చేయగా, దక్షిణ భారతంలో ధార్మికేతర కార్యక్రమాలకు ఎక్కువగా దానం చేస్తారట‌.

భారతీయుల్లో దానగుణం ఎక్కువ.... అందులోనూ సౌత్ ఇండియా ముందుంది
X

భారతీయులు దానాలు ఎక్కువగా చేస్తారని ఓ సర్వే బహిర్గతపర్చింది. అయితే దానాల్లో కూడా ఎక్కువగా ధార్మిక సంస్థలకే చేస్తారట. తరువాత స్థానం యాచకులది. 2021-22 సంవత్సరంలో అక్షరాలా రూ.23.7వేలకోట్లు దాతృత్వానికి ఖర్చు చేశారు. అశోక విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి.

అధ్యయనం కోసం 18 రాష్ట్రాల్లోని మొత్తం 81,000 కుటుంబాలను సర్వే చేశారు. వారు చేసిన సర్వేలో, మొత్తం విరాళాలలో 70 శాతం మత సంస్థలకు అంటే రూ.16.6వేలకోట్లు, 12 శాతం యాచకులకు అంటే రూ.2.9వేలకోట్లు, 9 శాతం కుటుంబీకులు, స్నేహితులకు అంటే రూ.2వేలకోట్లు, 5శాతం మతేతర సంస్థలకు అంటే రూ.1.1వేలకోట్లు ఇచ్చారు. అందులోనూ పట్టణ ప్రాంతాల ప్ర‌జలకన్నా గ్రామీణ ప్రాంతాల ప్ర‌జలే ఎక్కువ దానాలు చేశారు.

ఉత్తర భారత దేశానికన్నా, దక్షిణ భారతం, తూర్పు భారత ప్రజలే ఎక్కువ దానాలు చేశారు. అందులోనూ ఉత్తర భారతీయులు ఎక్కువగా ధార్మిక సంస్థలకు విరాళాలు ఇస్తే, దక్షిణ, తూర్పు ప్రాంత ప్రజలు, పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ధార్మికేతర సంస్థలకు, వ్యక్తులకే విరాళాలు ఇచ్చారు.

చేసే సహాయంలో బందువులు, స్నేహితులకే ఎక్కువ మొత్తం సహాయం చేశారు. 1000 రూపాయల నుండి 10,000 రూపాయల దాకా వీరికి సహాయం చేయగా, అందరికన్నా తక్కువగా అంటే 100 రూపాయల లోపు యాచకులకు సహాయం చేశారు. మత సంస్థలకు 101 రూపాయల నుండి 500 రూపాయల వరకు విరాళాలు ఇచ్చారు.

మరో ముఖ్య విషయం, అధిక ఆదాయ వర్గాలు మతపరమైన కార్యక్రమాల‌కే ఎక్కువ విరాళాలు ఇచ్చాయి.

First Published:  20 Sept 2022 4:36 PM IST
Next Story