అమితాబ్.. మీరు ఫైనల్ మ్యాచ్ చూడొద్దు
మ్యాచ్‌కు అమితాబ్ రావడం ఇండియన్ ఫ్యాన్స్‌కు అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ మీరు మ్యాచ్‌కు రావొద్దు, ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉన్నా మ్యాచ్ మాత్రం చూడకంటి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్టులు పెడుతున్నారు.
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు మరికొద్ది గంటల సమయమే మిగిలుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే హోరాహోరీ పోరు చూసేందుకు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. మ్యాచ్‌కు సామాన్యులతో పాటు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు సైతం మ్యాచ్ చూడబోతున్నారంటే ఫైనల్ ఏ లెవల్లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఫైనల్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా హాజరు కాబోతున్నారు. అమితాబ్ బచ్చన్ ఒక్కరే కాదు నార్త్ టు సౌత్ చాలామంది సెలబ్రెటీలు వస్తున్నారనుకోండి. కానీ, మ్యాచ్‌కు అమితాబ్ రావడం ఇండియన్ ఫ్యాన్స్‌కు అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ మీరు మ్యాచ్‌కు రావొద్దు, ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఉన్నా మ్యాచ్ మాత్రం చూడకంటి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రిక్వెస్టులు పెడుతున్నారు.
అమితాబ్ మ్యాచ్ చూస్తే టీమిండియా ఓడిపోతుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ప్లీజ్ మీరు మ్యాచ్ చూడటానికి రావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇలా చేయడానికి కారణం కూడా అమితాబే కావడం విశేషం. సెమీస్‌లో కివీస్‌పై టీమిండియా విజయం తర్వాత.. నేను చూడనప్పుడే మనం గెలుస్తాం అని అమితాబ్ ట్వీట్ చేశారు. దీంతో అమితాబ్‌ను మ్యాచ్ చూడొద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. దీనిపై అమితాబ్ మరో ట్వీట్ చేశారు. మీ అందరూ నన్ను మ్యాచ్‌కు వద్దు, వద్దు అంటుంటే.. మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని నేను కూడా ఆలోచిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమిండియా విషయంలో అమితాబ్ ఇలాంటి వాటిని నమ్ముతారట. 2011లోనే ఈ విషయాన్ని ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ చెప్పారు. చూడాలి మరి అమితాబ్ రేపు మ్యాచ్ చూడటానికి వస్తారా..?, లేదా?. ఒకవేళ అమితాబ్ మ్యాచ్ చూడటానికి వస్తే ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.