మన భూమిని ఆక్రమించుకునేందుకు చైనా యత్నించింది, మనం తిప్పికొట్టాం:లోక్ సభలో రాజ్ నాథ్ ప్రకటన
9వ తేదీన ఇరు సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, అయితే ఈ ఘర్షణలో ఎవరూ తీవ్రంగా గాయపడటం కానీ, మరణించడం కానీ జరగలేదని లోక్ సభకు తెలిపారు రాజ్ నాథ్ సింగ్ . చైనా దాడి ప్రారంభించగానే మన కమాండర్లు క్షణాల్లోనే ప్రతిస్పందించారని, దాంతో చైనా సైనికులు వెనక్కి వెళ్ళిపోయారని రాజ్ నాథ్ చెప్పారు.
ఈ నెల 9వ తేదీన మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నించిందని అయితే మన సైన్యం చైనా చర్యలను తిప్పికొట్టిందని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటుకు చెప్పారు.
లోక్ సభలో ఆయన మాట్లాడుతూ , ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాతో చర్చించామని తెలిపారు. వారు చేసిన పనిపై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. సరిహద్దులను కాపాడేందుకు మన సైనికులు ఎల్లప్పుడూ సర్వసన్నద్ధంగా ఉన్నారని, ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని రాజ్ నాథ్ అన్నారు.
9వ తేదీన ఇరు సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, అయితే ఈ ఘర్షణలో ఎవరూ తీవ్రంగా గాయపడటం కానీ, మరణించడం కానీ జరగలేదని సభకు తెలిపారు రాజ్ నాథ్. చైనా దాడి ప్రారంభించగానే మన కమాండర్లు క్షణాల్లోనే ప్రతిస్పందించారని, దాంతో చైనా సైనికులు వెనక్కి వెళ్ళిపోయారని రాజ్ నాథ్ చెప్పారు.
చైనా, భారత సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలంటూ ఈ రోజు ఉదయం నుంచీ ఉభయసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో కొద్ది సేపటి క్రితం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
లోక్ సభలో ఈ ప్రకటన చేశారు.