Telugu Global
National

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లను భారతదేశం స్వాధీనం చేసుకోవాలి -భజరంగ్ దళ్ పిలుపు

మధ్యప్రదేశ్‌లో జరిగిన భజరంగ్ దళ్ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ , 1800 సంవత్సరాల తర్వాత యూదులు పాలస్తీనా భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఇజ్రాయెల్ అనే యూదుల రాజ్యాన్ని స్థాపించారు. అలాగే భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లను కూడా తిరిగి స్వాధీనం చేసుకుని అఖండ భారత్ ను పునర్నిర్మించాలని అన్నారు.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లను భారతదేశం స్వాధీనం చేసుకోవాలి -భజరంగ్ దళ్ పిలుపు
X

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లను భారతదేశం స్వాధీనం చేసుకుని అఖండభారత్ ను పునర్నిర్మించాలని భజరంగ్ దళ్ పిలుపునిచ్చింది.

మధ్యప్రదేశ్‌లో జరిగిన భజరంగ్ దళ్ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ , 1800 సంవత్సరాల తర్వాత యూదులు పాలస్తీనా భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఇజ్రాయెల్ అనే యూదుల రాజ్యాన్ని స్థాపించారు. అలాగే భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లను కూడా తిరిగి స్వాధీనం చేసుకుని అఖండ భారత్ ను పునర్నిర్మించాలని అన్నారు. ఒకప్పుడు ఈ దేశాలన్నీ భారత్ లో అంతర్భాగమని వక్తలు అన్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను భారతీయ జర్నలిస్టు అశోక్ స్వైన్ తన ట్విట్టర్ ఖాతా లో షేర్ చేశారు.

అతని ట్వీట్ పై 'బేబీ ఎనిగ్మా' అనే నేపాలీ పౌరుడు వ్యాఖ్యానిస్తూ ,: “నేపాల్ ఎప్పటి నుండి భారతదేశంలో భాగమైంది? నేపాల్ ఉనికిలో ఉన్నప్పుడు భారతదేశం లేదు. నేపాలీ ప్రజలు భారతదేశాన్ని ఎందుకు ఇష్టపడరని భారతీయులు ఆశ్చర్యపోతుంటారు. ఇదిగో ఇలాంటి మాటలు, చేతలవల్లే ఇష్టపడరు."అని అన్నారు.

మరో ట్విట్టర్ వినియోగదారు మహ్మద్ హసన్ ఇలా అన్నారు, “సంఘీలు చాలా పిరికి వ్యక్తులు. భారతదేశంలోని మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేసే విషయానికి వస్తే వారు తమ సంఖ్యబలం వల్ల‌ ధైర్యంగా ఉంటారు. ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకునే బదులు, భారత్ నుంచి చైనా లాక్కున్న వేల ఎకరాల భూములను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు?'' అని ప్రశ్నించారు.

First Published:  10 Jan 2023 7:32 AM GMT
Next Story