Telugu Global
National

కోడిగుడ్ల ఉత్పత్తిలో రెండోస్థానంలో భారత్.. వినియోగంలో మాత్రం!!

మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. భారత్ లో మాత్రం ఆ సంఖ్య 73 దగ్గరే ఆగిపోయింది. గుడ్డు పోషకాహారం అని ప్రచారం చేస్తున్నా కూడా భారత్ లో తలసరి వినియోగం మాత్రం పెరగడంలేదు.

కోడిగుడ్ల ఉత్పత్తిలో రెండోస్థానంలో భారత్.. వినియోగంలో మాత్రం!!
X

కోడిగుడ్ల ఉత్పత్తిలో భారత్ స్థానం ఏడాదికేడాది మెరుగవుతోంది. గతేడాది మూడో స్థానంలో ఉన్న భారత్ ఈ ఏడాది రెండో స్థానానికి ఎగబాకింది. అయితే వినియోగంలో మాత్రం భారత్ ర్యాంక్ 114 కావడం విశేషం. భారత్ లో కోడిగుడ్ల ఉత్పత్తి జోరుగా సాగుతున్నా.. స్థానికంగా వాటి వినియోగం మాత్రం పెరగడంలేదు. ఏడాదికి కనీసం 180 కోడిగుడ్లు తినాలని నేషనల్ న్యూట్రిషన్ కౌన్సిల్ సూచిస్తున్నా.. మన దేశంలో తలసరి గుడ్ల వినియోగం 73 దగ్గరే ఆగిపోయింది. మెట్రో నగరాల్లో వినియోగం 100 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆసంఖ్య తక్కువగా ఉంది. ఇక ప్రాంతాల వారీగా లెక్క తీస్తే.. ఉత్తరాదికంటే దక్షిణాదిలోనే కోడిగుడ్డు వినియోగం ఎక్కువ.

తెలుగు రాష్ట్రాల్లో మెరుగు..

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కోడిగుడ్ల వినియోగం ఎక్కువగా ఉండటం విశేషం. తెలంగాణలో తలసరి వినియోగం 100 కాగా, ఏపీలో తలసరి వినియోగం 110. కరోనా కంటే ముందు రోజుకు దేశవ్యాప్తంగా 26 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుండగా, కరోనా తర్వాత రోజుకి 21 కోట్లకు తగ్గింది. కరోనా సమయంలో పౌల్ట్రీ రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఇప్పుడది 26 కోట్లను దాటడంతో భారత్ గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానానికి ఎగబాకింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో దక్షిణాది రాష్ట్రాలే మొదటి మూడు స్థానాల్లో ఉండటం మరో విశేషం. ఏపీ, తమిళనాడు, తెలంగాణ వరుసగా మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి.

ప్రపంచ వినియోగం ఇలా ఉంది..

మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. భారత్ లో మాత్రం ఆ సంఖ్య 73 దగ్గరే ఆగిపోయింది. గుడ్డు పోషకాహారం అని ప్రచారం చేస్తున్నా కూడా భారత్ లో తలసరి వినియోగం మాత్రం పెరగడంలేదు. అయితే ఎగుమతుల ద్వారా భారత్ లో వ్యాపార వర్గాలు లాభాలు ఆర్జిస్తున్నాయి. కరోనా తర్వాత భారత్ లో పౌల్ట్రీ రంగం మళ్లీ పుంజుకుంది.

First Published:  7 Nov 2022 9:06 AM IST
Next Story