Telugu Global
National

ప్రతిపక్షంలోనే ఉంటాం - ఇండియా కూటమి

ఇండియా కూటమికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం తమ దగ్గర లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా తీర్పును అభివర్ణించారు ఖర్గే.

ప్రతిపక్షంలోనే ఉంటాం - ఇండియా కూటమి
X

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు కాంగ్రెస్ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కోరిక ఇండియా కూటమికి లేదన్నారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, డీఎంకే అధినేత స్టాలిన్, టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీ, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నేత సంజయ్ రౌత్, శరద్ పవార్‌, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, లెఫ్ట్ పార్టీల నేతలు రాజా, సీతారాం ఏచూరి హాజరయ్యారు.

సమావేశం అనంతరం మాట్లాడిన ఖర్గే.. ఇండియా కూటమికి అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం తమ దగ్గర లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా తీర్పును అభివర్ణించారు ఖర్గే. ప్రతిపక్షంలోనే కూర్చుండి ప్రభుత్వానికి ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడుతామన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు రాగా.. ఇండియా కూటమికి 232 స్థానాలు వచ్చాయి. బీజేపీ సొంతంగా 240 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి షాకిస్తూ అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

First Published:  6 Jun 2024 12:30 AM IST
Next Story