Telugu Global
National

64 కోట్ల మంది ఓటు.. ప్ర‌పంచ రికార్డు సృష్టించామ‌న్న ఈసీ

ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌లు చ‌రిత్రాత్మ‌కమ‌ని సీఈసీ చెప్పారు. రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు.

64 కోట్ల మంది ఓటు.. ప్ర‌పంచ రికార్డు సృష్టించామ‌న్న ఈసీ
X

ప్రపంచంలోని అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశమైన భార‌త్ ఈ ఎన్నిక‌ల్లో వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించింది. 64 కోట్ల 20 ల‌క్షల మంది ఓటేయ‌డంతో, అత్య‌ధిక మంది ఓటేసిన దేశంగా ప్ర‌పంచ రికార్డు సృష్టించామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌కటించింది. రేపు దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపున‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామ‌ని ఈసీ ప్ర‌క‌టించింది. ఏడు విడతల పోలింగ్ విజయవంతంగా ముగిసింద‌ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఓటు వేసిన కోట్ల మందికి ఆయ‌న ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చారు.

ఈ ఎన్నిక‌లు చ‌రిత్రాత్మ‌కం

ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌లు చ‌రిత్రాత్మ‌కమ‌ని సీఈసీ చెప్పారు. రికార్డు స్థాయిలో 64.2 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. ఇందులో 31 కోట్ల మంది మహిళలు ఉన్నారంటూ వారిని ప్రశంసించారు.

27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ‌

మ‌న దేశ ఓటర్లు ఈ ఎన్నిక‌ల్లో కొత్త చరిత్రను లిఖించారని, ఏకంగా 64.2 కోట్ల మంది ఓటు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేసినవారి సంఖ్య జీ7 దేశాల్లో ఓట‌ర్ల కంటే 1.5 రెట్లు అధికమని, యూరోపియన్ యూనియన్లోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువని ఆయ‌న వెల్లడించారు. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తిని చాటిన ఓట‌ర్లంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

First Published:  3 Jun 2024 9:28 AM GMT
Next Story