Telugu Global
National

కేంద్ర మంత్రి జైశంకర్‌‌పై లండన్‌లో దాడి..ఖండించిన భారత్

భారత విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో ఖలిస్థానీ సానుభూతిపరులు రెచ్చిపోయారు.

కేంద్ర మంత్రి జైశంకర్‌‌పై లండన్‌లో దాడి..ఖండించిన భారత్
X

కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌‌ను లండన్‌లో ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నెల 4న జైశంకర్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఐదు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. లండన్ లోని ఛాతమ్ హౌస్ లో జరిగిన అధికారిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూలురు ఖలిస్థానీ జెండాలను ప్రదర్శిస్తూ భారత్ కు, విదేశాంగ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇంతలో గుంపులోని ఒక వ్యక్తి భారత జెండాను పట్టుకుని జైశంకర్ కారు సమీపంలోకి వచ్చి, మన జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. దీంతో అప్రమత్తమైన లండన్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జైశంకర్‌‌ లండన్ పర్యటనలో భద్రతమైన లోపంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీలవి రెచ్చగొట్టే చర్యలని మండిపడింది. జైశంకర్ పర్యటనలో భద్రతా లోపాన్ని ఫుటేజీలో మేం పరీశిస్తామని భారత్ పేర్కొన్నాది

First Published:  6 March 2025 1:04 PM IST
Next Story