3 తీర్మానాలు, 5 కమిటీలు.. ముగిసిన 'ఇండియా' కూటమి భేటీ
ఇండియా కూటమి వేదికపై 60 శాతం భారత్ ఉందని అన్నారు రాహుల్ గాంధీ. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని చెప్పారు. అందరం కలసి కట్టుగా ఉండాలన్నారు.
ముంబైలో 'ఇండియా' కూటమి భేటీ ముగిసింది. ఈసారి కూటమిలోని పార్టీ నాయకులు మరింత ఉత్సాహంగా కనిపించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల వేళ కేంద్రం గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించడం, జమిలి జపం చేయడం.. ఇవన్నీ బీజేపీ ఓటమికి సంకేతాలని అంటున్నారు నాయకులు. మొత్తంగా తాజా భేటీలో 3 తీర్మానాలు చేశారు, 5 కమిటీలు నియమించారు
3 తీర్మానాలు..
1. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలన్నీ కలిసి పోటీ చేయాలని నిర్ణయం
2. ఈ నెల మూడో వారం నుంచి ర్యాలీల నిర్వహణ
3. జుడేగా భారత్ - జీతేగా ఇండియా నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయం
इस बैठक में दो महत्वपूर्ण निर्णय लिए गए।
— Congress (@INCIndia) September 1, 2023
1. एक कॉर्डिनेशन कमेटी होगी
2. जल्दी ही सीट शेयरिंग पर विचार कर रिजॉल्यूशन पारित किया जाएगा
: INDIA गठबंधन की बैठक के बाद @RahulGandhi जी pic.twitter.com/Rh7FpMSzSD
5 కమిటీలు..
14మందితో ఎన్నికల వ్యూహం, సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. కూటమిలో మొత్తం 28 పార్టీలు ఉండగా కాంగ్రెస్ సహా మొత్తం 14 పార్టీలకు ఈ కమిటీలో చోటు లభించింది. ప్రచార కమిటీలో కాంగ్రెస్ సహా మొత్తం 19 పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. మీడియా, సోషల్ మీడియా కోసం వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేశారు. వర్కింగ్ గ్రూప్ ఫర్ రీసెర్చ్ పేరుతో 11 పార్టీలతో మరో కమిటీ ఏర్పాటు చేశారు.
ఇండియా కూటమి వేదికపై 60 శాతం భారత్ ఉందని అన్నారు రాహుల్ గాంధీ. ఈ బలమైన శక్తిని ఓడించడం బీజేపీ తరం కాదని చెప్పారు. అందరం కలసి కట్టుగా ఉండాలన్నారు. ఇండియా కూటమి భేటీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన అన్ని పార్టీలు దేశాన్ని రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తాని చెప్పారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అనేక సమస్యలపై పొరాడతామని అన్నారు. మోదీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పారు ఖర్గే. కూటమి సమావేశానికి హాజరైన ఇతర పార్టీల నాయకులు కూడా బీజేపీ పతనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కలసికట్టుగా ముందుకెళ్తామన్నారు.