Telugu Global
National

ఢిల్లీ సర్కార్ మెడకు మరో కేసు... సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు

ఢిల్లీ సర్కార్ మెడకు మరో స్కాం చుట్టుకుంది. బస్సుల కొనుగోళ్ళలో అక్రమాలు జరిగాయంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు.

ఢిల్లీ సర్కార్ మెడకు మరో కేసు... సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు
X

ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సర్కారు మెడకు మరో స్కాం చుట్టుకుంది. వేయి లోఫ్లోర్ బస్సుల కొనుగోళ్ళలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలన్న ప్రతిపాదనకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు పలు విడతలుగా సోదాలు నిర్వహించారు. ఇదే అంశంలో ఈడీ సైతం దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ కేసుకు తోడు ఇప్పుడు బస్సుల కొనుగోలు స్కాం ఆప్ సర్కార్ ను మరింత ఇరుకున పెట్టనుంది. ఈ కేసులో సీబీఐ ఏడాదిన్నర క్రితమే ఏమీ తేల్చలేదని ఇప్పుడు కొత్తగా మళ్ళీ విచారణ చేపట్టి ఏం చేయనుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో అన్నారు. లెఫ్టి నెంట్ గవర్నర్ తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలనుకుంటున్నారని, అందుకే ఏమీ లేని దాంట్లో స్కాం అంటూ విచారణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

First Published:  11 Sept 2022 4:18 PM IST
Next Story