Telugu Global
National

ముందుంది ముసళ్ల పండగ.. భారత్ వృద్ధి రేటు ఢమాల్..

భారత్ అభివృద్ధి రేటుని IMF మరింత తగ్గించింది. 6.8 శాతానికి పరిమితం చేసింది. దీంతో ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అర్థమవుతోంది.

ముందుంది ముసళ్ల పండగ.. భారత్ వృద్ధి రేటు ఢమాల్..
X

భారత్ వృద్ధిరేటు అంచనాని భారీగా కోసేసింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF). వృద్ధిరేటు అంచనాని కేవలం 6.8శాతానికి పరిమితం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధిరేటు మందగమనం ఉన్నా కూడా ఆయా దేశాలకు స్థిరమైన కారణాలున్నాయి. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం సహా.. ఇతరత్రా రాజకీయ అస్థిరత కారణాలతో ప్రపంచ దేశాల వృద్ధిరేటుని కూడా IMF తగ్గించి చూపించింది. కానీ రాజకీయ స్థిరత్వం ఉన్న భారత్ లో ఇలాంటి వృద్ధిరేటు విపరీత పరిణామాలకు దారి తీస్తుందనే అనుమానాలు కలిగిస్తోంది.

2021-22లో భారత్ వృద్ధి రేటు 8.7 శాతం

2022 జనవరిలో వృద్ధిరేటు అంచనా 8.2 శాతం

జులైలో వృద్ధిరేటు అంచనా 7.4 శాతం..

తాజా అంచనా కేవంల 6.8 శాతం..

ఈ గణాంకాలు చాలు భారత్ పురోగమిస్తోందా..? తిరోగమిస్తోందా..? అని చెప్పడానికి. అయితే ఇక్కడ బీజేపీ నాయకులు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవ‌డానికి వెసులుబాటు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని, ఇందుకు భారత్ మినహాయింపు కాదని చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. రూపాయి పతనాన్ని కూడా అమెరికా డాలర్ తో పోల్చి చూసుకోమంటున్న మేథావి ఆర్థిక మంత్రిగా ఉన్న దేశంలో ఆర్థిక పరిస్థితి అంచనాలు ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటాయని అటు ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు, ప్రతివిమర్శలు ఎలా ఉన్నా కూడా భవిష్యత్తు మరింత కష్టంగా ఉంటుందని IMF అంచనాలు తెలియజేస్తున్నాయి.

రాబోయేది గడ్డుకాలమే..!

కరోనా కాలంలో కూడా ధైర్యంగా నిలబడ్డాం. ఉచిత బియ్యం ఇచ్చామని కేంద్రం చంకలు గుద్దుకున్నా.. ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలు ఉపాధి మార్గాలు వెతుక్కోవడం, విధులకు హాజరు కావడం, లాక్ డౌన్ ప్రభావాలను వెంటనే వదిలించుకోవడంతో పరిస్థితి గాడిన పడింది. కానీ ద్రవ్యోల్బణం వెంటాడింది. ఇప్పుడు అభివృద్ధి రేటుని IMF మరింత తగ్గించింది. దీంతో ముందు ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అర్థమవుతోంది.

First Published:  12 Oct 2022 8:32 AM IST
Next Story