Telugu Global
National

కులాల‌పై ఆరా తీస్తే క‌ఠిన చ‌ర్య‌లే.. - విద్యార్థుల‌కు ఐఐటీ-బాంబే హెచ్చ‌రిక‌

కుల వివక్ష వ్యతిరేక పోస్టర్లను అధికారులు క్యాంపస్‌లో అతికించారు. తోటి విద్యార్థుల కులం గురించి వాకబు చేయకూడదని, అలాగే వారి జేఈఈ ర్యాంకు, గేట్ స్కోరును కూడా ఆరా తీయకూడదని మార్గదర్శకాల్లో స్ప‌ష్టం చేశారు.

కులాల‌పై ఆరా తీస్తే క‌ఠిన చ‌ర్య‌లే.. - విద్యార్థుల‌కు ఐఐటీ-బాంబే హెచ్చ‌రిక‌
X

తోటి విద్యార్థుల కులం గురించి ఆరా తీస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఐఐటీ-బాంబే త‌మ విద్యార్థుల‌ను హెచ్చ‌రించింది. కుల‌గోత్రాల బ‌దులు.. ఆట‌పాట‌లు, సినిమాలు, సంగీతంలో వారి ఆస‌క్తిని తెలుసుకుని క‌లసిపోవాల‌ని తెలిపింది. ఈ మేర‌కు తాజాగా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12న బీటెక్ ఫ‌స్టియ‌ర్ విద్యార్థి దర్శన్ సోలంకి హాస్టల్ భవనం ఏడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న నేప‌థ్యంలో ఐఐటీ-బాంబే అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు.

ఐఐటీ-బాంబే క్యాంపస్‌లో కుల వివక్ష ఉందని, తన కులం గురించి తెలియగానే తోటి విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని ద‌ర్శ‌న్ సోలంకి తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేటప్పుడు చెప్పినట్టు ముంబై పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

కుల వివక్ష వ్యతిరేక పోస్టర్లను అధికారులు క్యాంపస్‌లో అతికించారు. తోటి విద్యార్థుల కులం గురించి వాకబు చేయకూడదని, అలాగే వారి జేఈఈ ర్యాంకు, గేట్ స్కోరును కూడా ఆరా తీయకూడదని మార్గదర్శకాల్లో స్ప‌ష్టం చేశారు. ఈ స్కోర్లను బట్టి కూడా విద్యార్థుల కులాన్ని అంచనా వేసే అవకాశం ఉండటమే దీనికి కారణం. కులమత, లింగ భేదాలను ఎద్దేవా చేసేలా వ్యవహరించరాదని, వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

First Published:  1 Aug 2023 5:12 AM GMT
Next Story