ఆవు పొడిస్తే పరిహారం ఎవరిస్తారు? -బీజేపీని ప్రశ్నించిన మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత సోమవారం నాడు మాట్లాడుతూ, దేశంలో అరాచకత్వాన్ని అంతం చేయడానికి 2024లో బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ప్రభుత్వాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఆమె అన్నారు.
ప్రేమికుల రోజున ఆవును కౌగిలించుకోవాలని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకున్నప్పటికీ దానిపై విమర్శలు, ఎగతాళులు మాత్రం ఆగడం లేదు. ఆవును కౌగలించుకున్న వ్యక్తిని ఆవు తంతే నష్ట్పరిహారం ఎవరిస్తారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత సోమవారం నాడు మాట్లాడుతూ, దేశంలో అరాచకత్వాన్ని అంతం చేయడానికి 2024లో బీజేపీని ఓడించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ప్రభుత్వాన్ని స్థాపించడానికి కృషి చేయాలని ఆమె అన్నారు.
బెంగాల్ లో హింస, అవినీతిపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ తమ రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితి దేశంలోని ఇతర ప్రాంతాల కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో BSF ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.
సరిహద్దు ప్రాంతాల్లో అమాయకులు హత్యకు గురవుతున్నారని, ఈ హత్యలపై నిజనిర్ధారణ బృందాలను పంపేందుకు కేంద్రం ఎప్పుడూ వెనకడుగు వేస్తోందని మమత అన్నారు.