'నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అయితే రిమోట్ కంట్రోల్ నాతోనే ఉంటుంది' : మల్లికార్జున ఖర్గే
మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడైతే రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ చేతుల్లో ఉంటుందన్న బీజేపీ ఆరోపణలపై ఖర్గే మండి పడ్డారు. తాను అధ్యక్షుడిని అయితే రిమోట్ కంట్రోల్ తనతోనే ఉంటుందన్నారు. ఏ నిర్ణయమైనా మా కమిటీ తీసుకుంటుంది.ఎన్నికైన సభ్యులు , వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది అని ఖర్గే స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా బిజెపి చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, అధ్యక్ష అభ్యర్ధి మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. బిజెపి ఎన్నడైనా అద్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించిందా అని ప్రశ్నించారు. ఎప్పుడూ ఏకాభిప్రాయం పేరుతో ఎవరో ఒకరిని రుద్దడమే తప్ప ఎన్నికలు జరపలేదు అని ధ్వజమెత్తారు. ఖర్గే సోనియా గాంధీ చేతిలో రిమోట్ అంటూ బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనలను ఆయన ఖండించారు.
తాను అధ్యక్షుడిని అయితే రిమోట్ కంట్రోల్ తనతోనే ఉంటుందన్నారు. ఏ నిర్ణయమైనా మా కమిటీ తీసుకుంటుంది.ఎన్నికైన సభ్యులు , వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది అని ఖర్గే స్పష్టం చేశారు. నేను రిమోట్ కంట్రోల్ తో పనిచేసే వ్యక్తినని చాలా మంది చెబుతున్నారు. సోనియా గాంధీ ఏం చెబితే అదే నేను చేస్తానంటున్నారు. కాంగ్రెస్ లో అటువంటి పరిస్థితి లేదు. ఏ నిర్ణయమైనా సమష్టిగా తీసుకుంటారని చెప్పారు.
తాను గెలిస్తే పార్టీ పదవుల్లో 50 శాతం 50 యేళ్ళ లోపు వ్యక్తులకు రిజర్వేషన్ కల్పిస్తామని హమీ ఇచ్చారు. నా పార్టీ సిద్దాంతాన్ని కాపాడేందుకు నేను బరిలో దిగాను. ఐక్యత కోసం పాటు బడాలని, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఇచ్చిన పిలుపుతో పని చేసిన గాంధీ, నెహ్రూ ల సిద్ధాంతాల కోసం తాను పాటు పడతానని ఆయన చెప్పారు. పార్టీ సహచరులు,కార్యకర్తలు కోరడంతోనే శశి థరూర్ పోటీ లో నిలిచారని ఖర్గే అన్నారు. అధ్యక్షుడి కోసం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ ప్రతినిధులను తనకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు.