Telugu Global
National

'నేను మగవాడిని.. నన్ను ఈడీ, సీబీఐ తాకలేవు'.. సువేందుకు టీఎంసీ నేత కౌంటర్

పశ్చిమబెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ 'నబానా ఛలో' పేరుతో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కొంత మంది మహిళా పోలీసులు సువేందు అధికారిని వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను మగవాడిని.. నన్ను ఈడీ, సీబీఐ తాకలేవు.. సువేందుకు టీఎంసీ నేత కౌంటర్
X

పశ్చిమ బెంగాల్‌లో ఒకప్పుడు టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి అనుచరుడిగా మెలిగాడు సువేందు అధికారి. బీజేపీ ఆయన్ను తమ వైపుకు లాక్కొని గత ఎన్నికల్లో ఆయనే సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగా తర్వాత సువేందు అధికారి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధినేతకు, ఒకప్పటి అనుచరుడు అయిన సువేందుకు మధ్య పోరు మాత్రం సాగుతోంది.

కాగా ఇటీవల పశ్చిమబెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ 'నబానా ఛలో' పేరుతో సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కొంత మంది మహిళా పోలీసులు సువేందు అధికారిని వ్యాన్‌లోకి ఎక్కిస్తుండగా ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీరు మహిళా పోలీసులు. నన్ను తాకొద్దు. పురుష పోలీసులను పిలవండి' అని వారిని వారించారు.

కాగా, ఈ వ్యాఖ్యలపై తాజాగా టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన 'ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు. నేను మగవాడిని' అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. డ్రెస్ పై ఆ వ్యాఖ్యలు ఏంటీ.. అని మీడియా ఆయన్ను ప్రశ్నించగా.. 'నన్ను ఈడీ, సీబీఐ తాకలేవు అని విర్రవీగే ఓ బీజేపీ నేత ఉన్నారు' అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇద్రిస్ అలీ సువేందు అధికారికి చురకలు అంటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

First Published:  22 Sept 2022 1:53 PM GMT
Next Story