హైదరాబాద్- అమృత్‌సర్, లక్నో, కొచ్చి, గ్వాలియర్.. విమాన సర్వీసులు షురూ
అమృత్‌సర్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం రోజూ ఉదయం 7.30 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మరో నాలుగు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ సహకారంతో అమృత్‌సర్, లక్నో, కొచ్చి, గ్వాలియర్లకు విమాన సర్వీసులు నడపనన్నట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి విమాన కనెక్టివిటీ మరింత పెరిగినట్లయిందని వెల్లడించారు.
ఈ శుక్రవారం నుంచి..
ఈ శుక్రవారం నుంచి అమృత్‌సర్, లక్నో, కొచ్చిలకు సేవలు ప్రారంభించినట్లు జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణికర్ తెలిపారు. గ్వాలియర్‌కు ఈనెల 28 నుంచి విమాన సర్వీసు ప్రారంభమవుతుందని చెప్పారు.
టైమింగ్స్..
అమృత్‌సర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రోజూ ఉదయం 7.30 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు అమృత్‌సర్ చేరుకుంటుంది. శంషాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.35 గంటలకు లక్నో చేరుకుంటుంది. ఇవి వారానికి ఆరు సర్వీసులు ఉంటాయి. కొచ్చికి వెళ్లే విమానం శంషాబాద్ నుంచి రోజూ రాత్రి 7.45 గంటలకు బయలుదేరి 9.30 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. ఇకపోతే శంషాబాద్-గ్వాలియర్ల మధ్య వారానికి మూడు సర్వీసులుంటాయి. శంషాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 4.20కి గ్వాలియర్ చేరుతుంది.