భార్య తెచ్చిన కట్నంపై భర్తకు హక్కు ఉండదు- సుప్రీంకోర్టు
పెళ్లికూతురుకు పుట్టింటి వాళ్లు బహుమతిగా ఇచ్చే కట్నంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
BY Telugu Global26 April 2024 1:33 PM IST
X
Telugu Global Updated On: 26 April 2024 1:33 PM IST
పెళ్లికూతురుకు పుట్టింటి వాళ్లు బహుమతిగా ఇచ్చే కట్నంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కట్నంపై భర్తకు ఎలాంటి హక్కు ఉండదని తేల్చి చెప్పింది. కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ సొమ్మను వాడుకోవచ్చు. కానీ తర్వాత ఆ మొత్తాన్ని భార్యకు తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపైనే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కట్నం అనేది ఉమ్మడి ఆస్తి ఎంతమాత్రం కాదని, దానిపై ఎలాంటి ఆధిపత్యం కానీ, యాజమాన్య హక్కులు కానీ భర్తకు సంక్రమించవని సుప్రీంకోర్టు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
కేరళకు చెందిన ఓ మహిళ తనకు పుట్టింటివారు ఇచ్చిన 89 గ్రాముల బంగారాన్ని భర్త తన అవసరాల మేరకు వాడుకున్నారని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారించిన అత్యున్నత ధర్మాసనం మహిళ కోల్పోయిన బంగారానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.
Next Story