భారత ప్రభుత్వానికి యూట్యూబ్ ద్వారా భారీ ఆదాయం
అదే సమయంలో 7.5 లక్షల మంది యూ ట్యూబ్ ద్వారా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు వివరించింది. 2023 నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మరింత ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ వివరించింది.

యూట్యూబ్ ద్వారా భారత జీడీపీకి వేల కోట్ల ఆదాయం వస్తోంది. 2021లో తమ వేదిక ద్వారా భారత జీడీపీకి 10వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని యూట్యూబ్ ప్రకటించింది. కంటెంట్ క్రియేషన్ ద్వారా ప్రభుత్వానికి ఈ మేరకు లభించిందని వెల్లడించింది.
అదే సమయంలో 7.5 లక్షల మంది యూ ట్యూబ్ ద్వారా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు వివరించింది. 2023 నుంచి యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మరింత ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ వివరించింది. 2023 నుంచి కొత్త బీటా వెర్షన్‌ను ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది. దీని వల్ల క్రియేటర్లకు కొత్తగా ఆదాయ మార్గాలు అందుతాయని చెప్పింది.
ఒక కంటెంట్‌ను అనేక ఇతర భాషల్లోనూ రూపొందించేలా క్రియేటర్లకు అవసరమైన సహకారం కూడా అందించబోతున్నట్టు వెల్లడించింది. 2023 యూ ట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మరింత ఆనందదాయకంగా ఉండేలా చూస్తామని యూట్యూబ్ హామీ ఇచ్చింది.