శ్రీవల్లికి బీజేపీ గిఫ్ట్ రూ.10కోట్లా..?
దేశ అభివృద్ధిని, బీజేపీ ప్రభుత్వాన్ని రష్మిక పొగడటం, ఆ పొగడ్తకు ప్రధాని మోదీ నేరుగా బదులివ్వడం, ఆయనకు హీరోయిన్ కృతజ్ఞతలు తెలపడం.. ఇవన్నీ ఓ ఎపిసోడ్ లాగా సాగిపోయాయి.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన రష్మిక, ఆ తర్వాత యానిమల్ తో మరింత ఫేమస్ అయింది. ఈ ఫేమస్ పర్సనాల్టీని ఇప్పుడు బీజేపీ తమ అనుకూల ప్రచారానికి వాడుకుంటోంది. అయితే ఇక్కడ రష్మిక ఉచిత ప్రచారమేమీ చేయట్లేదట. 'మేల్కొండి.. అభివృద్ధికి ఓటు వేయండి'.. అంటూ రష్మిక పెట్టిన వీడియోకి ఏకంగా ఆమెకు రూ.10కోట్లు ముట్టాయని అంటున్నారు ఉమైర్ సంధు అనే సినీ విమర్శకుడు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
#BJP Paid “ 10 cr ” to #RashmikaMandanna for political campaign !!! Shame on you !! Public ka Paisa Sahi Loot rahe ho !! Shahbash pic.twitter.com/bVCksFiYzm
— Umair Sandhu (@UmairSandu) May 16, 2024
బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాన్ని పొగుడుతూ హీరోయిన్ రష్మిక ఓ వీడియోని తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై ప్రయాణిస్తూ ఆమె ఈ వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఆ తర్వాత ప్రధాని మోదీ స్పందించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదంటూ ఆయన రష్మిక ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. మోదీ ట్వీట్‌పై రష్మిక కూడా స్పందించారు. 'సార్ ఇది నాకు ఎంతో గౌరవం' అంటూ ఆమె బదులిచ్చారు.
Sir! What an honor! It's incredibly fulfilling to witness our country's growth as a super proud young Indian. https://t.co/ZY19v2czFf
— Rashmika Mandanna (@iamRashmika) May 17, 2024
దేశ అభివృద్ధిని, బీజేపీ ప్రభుత్వాన్ని రష్మిక పొగడటం, ఆ పొగడ్తకు ప్రధాని మోదీ నేరుగా బదులివ్వడం, ఆయనకు హీరోయిన్ కృతజ్ఞతలు తెలపడం.. ఇవన్నీ ఓ ఎపిసోడ్ లాగా సాగిపోయాయి. అయితే ఇదంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందని నెటిజన్లు అంటున్నారు. అంతే కాదు.. రష్మిక వీడియోని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఉమైర్ సంధు రూ.10కోట్ల ఆఫర్ అంటూ ట్వీట్ వేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.