Telugu Global
National

రికార్డులు స్థాయిలో ఈసారి ఎండలు!

ఈ సమ్మర్‌‌లో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయని రిపోర్ట్‌లు చెప్తున్నాయి.

రికార్డులు స్థాయిలో ఈసారి ఎండలు!
X

ఈ సమ్మర్‌‌లో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయని రిపోర్ట్‌లు చెప్తున్నాయి. మనదేశం ఎప్పుడూ చూడనంత తీవ్రమైన ఎండలు ఈ సారి నమోదయ్యాయి. దేశంలో హీట్ వేవ్స్ ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయంటే..

ఈ సమ్మర్‌‌లో లాంగెస్ట్ హీట్ వేవ్స్ నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ రిపోర్ట్‌ల ప్రకారం తెలుస్తోంది. మార్చి 1 నుంచి జూన్ 9 మధ్య దేశంలోని 36 ప్రాంతాల్లో 15 హీట్ వేవ్ పీరియడ్స్ నడిచాయట. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

వాతావరణ శాఖ వివరాల ప్రకారం దేశంలో మార్చి 1 నుంచి హీట్ వేవ్ పరిస్థితులు మొదలయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలు, కోస్టల్ కర్ణాటక ప్రాంతాల మినహా దేశంలోని అన్ని ప్రాంతాలు ఈ హీట్ వేవ్స్ బారిన పడ్డాయి. రోజుల వారీగా చూస్తే.. ఒడిశాలో 27 రోజులు, రాజస్థాన్‌లో 23, పశ్చిమ బెంగాల్‌లో 21, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 20 రోజుల పాటు హీట్‌ వేవ్స్‌ నమోదయ్యాయి. ఆఖరికి ఎత్తైన ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌‌లలో కూడా హీట్ వేవ్స్ కనిపించాయి. కేరళ, తమిళనాడు వంటి తీర ప్రాంతాలు వరుసగా 5 నుంచి 14 రోజుల హీట్ వేవ్స్‌ను నమోదు చేశాయి.

ఈ సంవత్సరం నమోదైన విపరీతమైన ఉష్ణోగ్రతలు వాతావరణ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచాయి. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కూడా దీనికి కారణమైందని సైంటిస్టులు చెప్తున్నారు. సాధారణంగా పీఠభూమి ప్రాంతాల్లో 40 డిగ్రీలు, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే దాన్ని హీట్ వేవ్‌గా పరిగణిస్తారు. లేదా ఆయా ప్రాంతాల్లోని సాధారణ ఉష్ణోగ్రతలు 6.4 డిగ్రీల మేర పెరిగినప్పుడు కూడా హీట్ వేవ్‌గానే ప్రకటిస్తారు. ఇలాంటి హీట్ వేవ్స్ ఈ సారి దేశమంతటా కనిపించాయి. గడిచిన మే(2024) నెల చరిత్రలోనే అత్యంత వెచ్చని మే నెలగా రికార్డు సృష్టించింది. అంతేకాదు గ్లోబల్ యాన్యువల్ టెంపరేచర్ ర్యాంకింగ్స్ అవుట్‌లుక్ ప్రకారం 2024 సంవత్సరం అత్యంత వెచ్చని సంవత్సరంగా కూడా ర్యాంక్ పొందే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సారి రుతుపవనాలు కూడా ఎర్లీగానే ఎంట్రీ ఇచ్చాయి. సౌత్ ఇండియా వర్షాల్లో తడుస్తుంటే నార్త్ ఇండియా మాత్రం ఇంకా ఎండలతో ఉడికిపోతోంది. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల హీట్ వేవ్స్ కనిపిస్తున్నాయి. రానున్న నాలుగు రోజుల పాటు తూర్పు, వాయువ్య భారతదేశంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని పేర్కొంది.

ఏదేమైనా ఈ ఏడాది కనిపించిన విపరీతమైన వాతావరణ పరిస్థితులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచాయి. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో భూమిపై వాతావరణం ఎలాంటి మార్పులకు లోనవుతుందో అని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను అదుపుచేయకపోతే తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

First Published:  16 Jun 2024 6:00 AM IST
Next Story