Telugu Global
National

చలికి హార్ట్ ,బ్రెయిన్ ఎటాక్స్... 25 మంది మృతి!

ఉత్తరప్రదేశ్ లో చలి కారణంగా ఒక్క కాన్పూర్ పట్టణంలోనే 25 మంది మరణించారు. చలి తీవ్రత వల్ల సడెన్ గా రక్తపోటు పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ వచ్చి ఈ మరణాలు సంభవించాయని వైద్యులు చెబుతున్నారు.

చలికి హార్ట్ ,బ్రెయిన్ ఎటాక్స్... 25 మంది మృతి!
X

దేశంలో అనేక చోట్ల చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. కొన్ని చోట్ల ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్ లో కూడా నిన్నటి నుంచి, సన్నటి ముసురు ఒకవైపు, పెరిగిన చలి ఒక వైపు ప్రజ‌లను వణికిస్తోంది. ఇక తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది.

ఇక ఉత్తరప్రదేశ్ లో చలి కారణంగా ఒక్క కాన్పూర్ పట్టణంలోనే 25 మంది మరణించారు. చలి తీవ్రత వల్ల సడెన్ గా రక్తపోటు పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ వచ్చి ఈ మరణాలు సంభవించాయని వైద్యులు చెబుతున్నారు. వీరిలో 17 మంది ఆస్పత్రికి తీసుకపోక ముందే చనిపోయారు.

కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ కంట్రోల్ రూం ప్రకారం.. గురువారం 723 మంది హృద్రోగులు ఎమర్జెన్సీ, ఓపీడీకి వచ్చారు.

వీరిలో 41 మంది పరిస్థితి విషమంగా ఉన్నందువల్ల వారిని మాత్రం ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఇందులో ఏడుగురు హృద్రోగులు చలికి మృతి చెందారు.

ఈ వాతావరణంలో చలి నుంచి రోగులకు రక్షణ కల్పించాలని కార్డియాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వినయ్ కృష్ణ అన్నారు.

లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU)లోని ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ, “ఈ చల్లని వాతావరణంలో గుండెపోటు ఒక వృద్ధులకు మాత్రమే వస్తుందనుకోవడం పొరపాటని, యుక్తవయస్కులకు కూడా గుండెపోటు వస్తుందన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చలినుంచి రక్షించుకోవాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు.

First Published:  6 Jan 2023 11:08 AM IST
Next Story