Telugu Global
National

హర్యాన ఓటమి అంగీకరించం : జైరాం రమేష్

హర్యాన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని ఆయన అన్నారు.

హర్యాన ఓటమి అంగీకరించం : జైరాం రమేష్
X

హర్యాన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా హర్యానా ఫలితాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఓటర్లు తీర్పును తాము అంగీకరించమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలవలేదని అన్నారు. వ్యవస్థలను బీజేపీ దుర్వనియోగం చేసిందని ఆరోపించారు. హర్యాన ఫలితాలు బీజేపీ తారుమరు చేసిందన్నారు. హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు మొత్తం తలకిందులు అయ్యాయి. హర్యానాలో బీజేపీ సర్కార్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అంచనా వేసిన వారికి ప్రజలు తీర్పు షాక్ ఇచ్చింది.

కాగా ఈ ఎన్నికల్లో గతం కంటే మరో 9 స్థానాలను అధికంగా గెలుచుకున్న బీజేపీ.. 49 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది. ప్రజాస్వామ్యం యొక్క ఓటమి.. మేము దీనిని అంగీకరించలేము. మేము ఫిర్యాదులు సేకరిస్తున్నాము. మా అభ్యర్థులు ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఇచ్చారని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. హర్యానా ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా అన్నారు. ఓటమికి కారణాలను పార్టీ అధిష్ఠానం విశ్లేషించాలి రాష్ట్రంలో పార్టీని పునరుద్దరించేందుకు కృషి చేయాలని ఆమె అన్నారు

First Published:  8 Oct 2024 1:00 PM
Next Story