Telugu Global
National

బీజేపీని బహిష్కరించండి... గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ పిలుపు

గుజరాత్ లో దాదాపు 30 లక్షల మంది డైమండ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళంతా ప్రధానంగా సౌరాష్ట్ర ప్రాంతంలోని సూరత్, నవ్‌సారి తదితర జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. పరిశ్రమలో కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం అమలు చేయడంలేదని, చేతివృత్తుల వారు దోపిడీకి గురవుతున్నారని గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ ఆరోపిస్తోంది.

బీజేపీని బహిష్కరించండి... గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ పిలుపు
X

గుజరాత్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బహిష్కరించాలని గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ (DWUG)పిలుపునిచ్చింది. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్న పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని ఆ యూనియన్ కార్మికులను కోరింది.

గుజరాత్ లో దాదాపు 30 లక్షల మంది డైమండ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళంతా ప్రధానంగా సౌరాష్ట్ర ప్రాంతంలోని సూరత్, నవ్‌సారి తదితర జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నారు.

పరిశ్రమలో కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం అమలు చేయడంలేదని, చేతివృత్తుల వారు దోపిడీకి గురవుతున్నారని DWUG చీఫ్ రమేష్ జిలారియా అన్నారు. "సూరత్‌లోని వజ్రాల కార్మికులపై వృత్తిపరమైన పన్నును రద్దు చేయాలనే డిమాండ్ గత దశాబ్ద కాలంగా పరిష్కరించబడలేదు." అన్నారాయన.

సూరత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్-కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలున్నాయి. వీటిలో 6,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సూరత్‌లోని కటర్‌గాం.వరచా అసెంబ్లీ స్థానాల్లో 4,500కు పైగా పెద్ద, చిన్న, మధ్యతరహా వజ్రాల ఫ్యాక్టరీలు ఉన్నాయి.

DWUG వైస్ ప్రెసిడెంట్ భవేష్ ట్యాంక్ మాట్లాడుతూ, ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందన్నారు. "కానీ నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వజ్రాల కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వడానికి ప్రభుత్వం వెనకడుగువేస్తోంది." అన్నారాయన. "వృత్తిపరమైన పన్ను మినహాయింపు, కార్మిక చట్టాల అమలు మొదలైన డిమాండ్లు నెరవేరకపోవడంతో మెజారిటీ వజ్రాల కార్మికులు గత మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారు." అని తెలిపారు భవేష్.

బీజేపీని బహిష్కరించాలంటూ DWUG గుజరాత్‌లోని దాదాపు 25,000 మంది సభ్యులకు, 40,000 మంది కార్మికులకు వాట్సాప్‌లో లేఖలు పంపింది. మిగతావారికి కూడా త్వరలో తమ సందేశం చేరుస్తామని యూనియన్ నాయకులు తెలిపారు.

మరో వైపు తమ డిమాండ్లను విస్మరించారని ఆరోపిస్తూ గొర్రెల కాపరి మల్ధారి సంఘం నాయకులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు.

First Published:  26 Nov 2022 10:04 AM IST
Next Story