Telugu Global
National

గుజరాత్ లో ప్ర‌శ్నాపత్రం లీక్, 30 మంది అరెస్ట్

పేపర్ లీకేజీకి సంబంధించి జనవరిలో వడోదరలోని ఓ కంప్యూటర్ సెంటర్‌పై దాడులు నిర్వహించగా, ఏడుగురు మహిళలతో సహా 30 మంది అభ్యర్థుల కాల్ లెటర్లు, ఖాళీ చెక్కులు, ఒరిజినల్ డాక్యుమెంట్లను ATS పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విచారణ అనంతరం వారిని గురువారం అరెస్టు చేశారు.

గుజరాత్ లో ప్ర‌శ్నాపత్రం లీక్, 30 మంది అరెస్ట్
X

గుజరాత్ రాష్ట్ర జూనియర్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నా పత్రాన్ని కొనుగోలు చేసిన ఆరోపణలపై 30 మంది వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) గురువారం అరెస్టు చేసింది.

ఈ పరీక్ష జనవరి 29 న జరగాల్సి ఉండగా పరీక్షకు కొన్ని గంటల ముందు లీక్ వ్యవహారం బైటపడి పరీక్షను రద్దు చేశారు.

జనవరిలో లీక్ వ్యవహారం బైటపడిన తర్వాత మోసం, క్రిమినల్ నేరాలు, ఇతర నేరాలకు పాల్పడినందుకు ఏజెంట్లు, మధ్యవర్తులతో సహా 19 మందిని ATS అరెస్టు చేసింది. వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు.

పేపర్ లీకేజీకి సంబంధించి జనవరిలో వడోదరలోని ఓ కంప్యూటర్ సెంటర్‌పై దాడులు నిర్వహించగా,

ఏడుగురు మహిళలతో సహా 30 మంది అభ్యర్థుల కాల్ లెటర్లు, ఖాళీ చెక్కులు, ఒరిజినల్ డాక్యుమెంట్లను ATS పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విచారణ అనంతరం వారిని గురువారం అరెస్టు చేశారు.

పేపర్ అమ్మిన‌ వారికి రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు చెల్లించేందుకు ఈ 30 మంది అంగీకరించారని, ఖాళీ చెక్కులు, ఒరిజినల్ సర్టిఫికెట్లను గ్యారంటీగా సమర్పించారని ATS పేర్కొంది.

వీరిలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉత్తర, మధ్య గుజరాత్ జిల్లాలైన మెహసానా, ఆరావల్లి, ఖేడా, దాహోద్, సబర్‌కాంత, గాంధీనగర్, ఛోటాడేపూర్, మహిసాగర్ జిల్లాలకు చెందినవారు.

1,181 మంది జూనియర్ క్లర్క్‌ల నియామకం కోసం జనవరి 29న గుజరాత్ పంచాయతీ సర్వీస్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉండిన ఈ పరీక్షలకు 9.53 లక్షల మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండింది.

జనవరి 29 తెల్లవారుజామున ATS ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నపత్రం కాపీని స్వాధీనం చేసుకుంది, ఆ తర్వాత ప్రభుత్వం పరీక్ష రద్దు చేసింది.

ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి, హైదరాబాద్‌లోని ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి, వడోదర నగరంలో ఇద్దరు నివాసితులు, కంప్యూటర్ సెంటర్‌ను నిర్వహిస్తున్న ఒకరితో సహా 15 మందిని జనవరి 29న‌ అరెస్టు చేయగా, మరో నలుగురిని కొంతకాలం తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు..

First Published:  6 April 2023 3:03 PM GMT
Next Story