Telugu Global
National

బిల్కిస్ బానో కేసు: ఆర్టిఐ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించిన గుజరాత్ ప్రభుత్వం

బిల్కిస్ బానో అత్యాచారం కేసులో ఉన్న రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడం పట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దోషులకు రిమిషన్‌ను సిఫార్సు చేసిన కమిటీ నిబంధనల కు సంబంధించి స‌మాచారం కోసం హక్కుల కార్యకర్త పంక్తి జోగ్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద అప్లై చేయగా హోం శాఖ ఆ అప్లికేషన్ ను తిరస్కరించింది.

బిల్కిస్ బానో కేసు: ఆర్టిఐ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించిన గుజరాత్ ప్రభుత్వం
X

సామూహిక అత్యాచార బాధితురాలైన బిల్కిస్ బానోకు క్షమాపణలు చెప్పేందుకు సెప్టెంబర్ 26 నుంచి పౌర సమాజ సంఘాలు యాత్ర చేపడుతున్నాయి. అయినా ప్ర‌భుత్వం ఈ వియ‌మై నిర్ల‌క్ష్యంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. దోషులకు రిమిషన్‌ను సిఫార్సు చేసిన కమిటీ నిబంధనల కు సంబంధించి స‌మాచారం వెల్ల‌డించేందుకు ప్ర‌భుత్వం నిరాక‌రించింది.

హక్కుల కార్యకర్త పంక్తి జోగ్ రాష్ట్ర హోం శాఖలో స‌మాచార హ‌క్కు (ఆర్టీఐ) కింద స‌మాచారం కోరుతూ దరఖాస్తు చేశారు.

దరఖాస్తులో కోరిన సమాచారం ఆర్‌టిఐ నిర్వచనం కిందకు రాదని ఆ శాఖ సమాధానం ఇచ్చింది. హోం శాఖ ఆర్టీఐ చట్టంలోని నిబంధనను ఉటంకిస్తూ, కోరిన సమాచారం సమాచార నిర్వచనం పరిధిలోకి రాదని పేర్కొంది.

మహితి అధికార్ పహెల్‌తో కలిసి పని చేస్తున్న జోగ్, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తానని అన్నారు. ఈ సమాధానం హాస్యాస్పదంగా ఉందని, ఇది హోం శాఖ నుంచి ఊహించలేదని ఆమె అన్నారు. గత ఐదేళ్లలో రెమిష‌న్ పొందే దోషుల పేర్లను పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీల విధివిధానాల సర్టిఫైడ్ కాపీలను ఆమె ఆర్టీఐ కింద‌ కోరింది. గత ఐదేళ్లలో రిమిషన్ కింద విడుదలైన ఖైదీల సంఖ్య, తేదీలతో సహా తెలుసుకోవాలని కోరింది.

బిల్కిస్ బానో కేసులో పదకొండు మంది ఖైదీలు ఆగస్టు 15న రిమిషన్ పాలసీ కింద విడుదలయ్యారు .వారిని తరువాత స్థానిక మితవాద సంస్థలు సన్మానించాయి.

ఈ విషయంలో తనకు ఎలాంటి పారదర్శకత క‌న‌బ‌డ‌డం లేదని, అందుకే దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నానని జోగ్ చెప్పారు. 2002లో గోధ్రా అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్‌ స్వస్థలమైన రంధిక్‌పూర్ నుండి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని పలువురు వ్యక్తులను హత్య చేశారు. బిల్కిస్‌పై సామూహిక అత్యాచారం జరిగింది.

ఈ కేసులో దోషుల విడుద‌లను నిర‌సిస్తూ, పౌర సమాజ సంఘాలు రంధిక్‌పూర్ నుండి సబర్మతి ఆశ్రమం వరకు యాత్ర చేపట్టనున్నాయి. అక్టోబర్ 4న యాత్ర ముగియనుంది. వడ్గాం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కూడా ఈ యాత్రలో పాల్గొన‌నునున్నారు.

First Published:  23 Sept 2022 6:51 AM GMT
Next Story