రాష్ట్రపతి పాదాలను తాకినందుకు ప్రభుత్వ ఇంజనీర్ సస్పెండ్
రాజస్థాన్ రోహెట్‌లో జరిగిన స్కౌట్ గైడ్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్ రాష్ట్రపతి పాదాలను తాకే ప్రయత్నం చేశారు. వెంటనే రాష్ట్ర పతి భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు లాగేశారు.
జనవరి 4న జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము పాదాలు తాకినందుకు రాజస్థాన్ ప్రభుత్వ ఇంజనీర్‌ను జనవరి 13న సస్పెండ్ చేశారు.
జనవరి 4న రాజస్థాన్ రోహెట్‌లో జరిగిన స్కౌట్ గైడ్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్ రాష్ట్రపతి పాదాలను తాకే ప్రయత్నం చేశారు. వెంటనే రాష్ట్ర పతి భద్రతా సిబ్బంది ఆమెను పక్కకు లాగేశారు. రాష్ట్రపతి పాదాలను తాకడానికి ప్రయత్నించడం ద్వారా ఆమె ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు, తద్వారా రాజస్థాన్ సివిల్ సర్వీస్ రూల్ కింద ఆమెను సస్పెండ్ చేస్తూ చీఫ్ ఇంజనీర్ (పరిపాలన), PHED ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రపతి కార్యక్రమంలో నీటి ఏర్పాట్లను చూసేందుకు సియోల్ వేదిక వద్ద ఉన్నారు. కానీ ఆమె భద్రతా నియమాలను ఉల్లంఘించి, అధ్యక్షురాలికి స్వాగతం పలికేందుకు అక్కడ ఉన్న అధికారుల వరుస లోకి చేరుకోగలిగింది. ఆకస్మాత్తుగా సియోల్ ముందుకు వెళ్ళి రాష్ట్రపతి పాదాలను తాకేందుకు ప్రయత్నించింది.
ఈ ఘటనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పరిగణించింది. రాష్ట్రపతి భద్రతలో తీవ్రమైన లోపంగా పరిగణించి, రాజస్థాన్ పోలీసుల నుండి నివేదిక కోరింది.