Telugu Global
National

ఆక‌తాయిల ఆటకట్టించే 'బ్లూటూత్ జుంకాలు'

అమ్మాయిలపై వేధింపులు, అరాచకాలు అరికట్టే అందుకు గోరఖ్ పూర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఒక వినూత్న ఆలోచన చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించి బ్లూటూత్ జుంకాలనుతయారు చేసారు

ఆక‌తాయిల ఆటకట్టించే బ్లూటూత్ జుంకాలు
X

అమ్మాయిలపై వేధింపులు, అరాచకాలు అరికట్టే అందుకు గోరఖ్ పూర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఒక వినూత్న ఆలోచన చేశారు. ఆధునిక టెక్నాలజీ వినియోగించి బ్లూటూత్ జుంకాలనుతయారు చేసారు. ఆక‌తాయిల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక ఆయుధంగా ఉపయోగపడేలా వీటిని రూపొందించారు.

అమ్మాయిలు తమ చెవులకు పెద్ద పెద్ద జూకాలు ధరించడం లేటెస్ట్ ఫాషన్. దానికి టెక్నాలజీ కలగలిపి అమ్మాయిలకు భద్రత పెరిగేలా ఆలోచించారు గోరఖ్‌పూర్లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఐటీఎం) ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థినులు. కళాశాలలోని ఆవిష్కరణ విభాగం సమన్వయకర్త వినీత్​రాయ్ ఆధ్వర్వంలో అఫ్రీన్ ఖాతూన్‌, హబీబా, రియాసింగ్‌, ఫాయా నూరీ వీటిని తయారు చేశారు.

సాధారణ జుంకాల మాదిరిగా కనిపించే వీటిలో బ్లూటూత్​ ఇయర్​బడ్​ను అమర్చారు. అలానే ఆపదలో ఉన్నప్పుడు అమ్మాయిలకు ఇవి ఓ ఆయుధంలా ఉపయోగడపతాయని విద్యార్థులు వివరించారు. వీటిలో బ్యాటరీతో కూడిన బ్లూటూత్‌ మాడ్యూల్‌, రెండు స్విచ్లు, చిన్న స్టీల్‌ పైపును అనుసంధానం చేశారు. వీటితో పాటు రెండు అలారం స్విచ్లు, మూడు ఎమర్జెన్సీ నంబర్లును ఫీడ్ చేస్తారు.


అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఒక స్విచ్ నొక్కితే ఎమర్జెన్సీ నంబర్లకు లోకేషన్‌తో పాటు కాల్‌ కూడా వెళ్తుంది. అలాగే మరో బటన్ నొక్కితే ఆకతాయిలపై మిరియాలు, మిర్చీ పొడి పిచికారీ అవుతుంది. ఈ చర్యలద్వారా త‌ద్వారా రెండు రకాలుగా అమ్మాయిలు తమను తాము రక్షించుకోవచ్చుని విద్యార్థినులు తెలిపారు. ఈ చెవి కమ్మలు 35 గ్రాములు బరువు ఉన్నాయని, తయారు చేసేందుకు రూ.1,650 ఖర్చు అయ్యిందని విద్యార్థులు తెలిపారు. రెండురోజుల్లో తాము ఈ ఆవిష్కరణ చేశామన్నారు.

ప్రస్తుతం సమాజంలో మహిళల పట్ల ఆకతాయిలో తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి జుంకాలు గనుక మార్కేట్ లోకి వస్తే మహిళలకు మరింత లాభం చేకూరుతుంది.




First Published:  11 March 2024 9:24 AM GMT
Next Story