గూగుల్ రేటింగులన్నీ ఫేక్... రివ్యూలను నమ్మని జనం
google rating: గూగుల్ ఇస్తున్న రివ్యూలు, రేటింగ్ ను జనాలు ఎంతవరకు నమ్ముతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఓ సర్వే నిర్చహించింది. ఈ సంస్థ వివిధ నగరాల్లోని 357 జిల్లాల్లో నివసిస్తున్న ప్రజల నుండి 56,000 ప్రతిస్పందనలను సేకరించింది.ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
ఇప్పుడు మనం ప్రతీ దాని కోసం గూగుల్ మీద ఆధారపడటం అలవాటయ్యింది. న్యూస్ కోసమే కాదు, మనకు తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా, ఏదైనా మార్కెట్ లోకి వచ్చిన కొత్త వస్తువు క్వాలిటీ గురించి తెలుసుకోవాలన్నా, రెస్టారెంట్లలో ఆహారం, హాస్పటల్ లో వైద్య సేవలు, మాల్స్ ....ఇలా ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా మనం గూగుల్ ను ఆశ్రయిస్తాం. ఆయా సంస్థలపై వచ్చిన రివ్యూల ఆధారంగా మనం ఆ వస్తువు తీసుకోవాలా లేదా ? ఆ రెస్టారెంట్ లో ఆహారం తీసుకోవాలా లేదా, ఫలానా ఆస్పత్రిలో వైద్యం తీసుకోవచ్చా లేదా అని నిర్ణయించుకుంటాం.
అయితే ఇలా గూగుల్ ఇస్తున్న రివ్యూలు, రేటింగ్ ను జనాలు ఎంతవరకునమ్ముతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఓ సర్వే నిర్చహించింది. ఈ సంస్థ వివిధ నగరాల్లోని 357 జిల్లాల్లో నివసిస్తున్న ప్రజల నుండి 56,000 ప్రతిస్పందనలను సేకరించింది.ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
గూగుల్ రివ్యూలపై రేటింగులపై నమ్మకం కలిగి ఉన్నది 3 శాతం మంది ప్రజలు మాత్రమే. 39% మంది గూగుల్ రేటింగులను అంతగా నమ్మలేమని చెప్పగా 7 శాతం మంది ఆ రెటింగులంతా ఫేక్ అని స్పష్టం చేశారు. 45% మంది గూగుల్ రివ్యూలు సరికాదని చెప్పగా, 37% మంది రివ్యూలన్నీ "సానుకూల పక్షపాతం" తో కూడుకున్నవని పేర్కొన్నారు.
ఈ సర్వేలో పాల్గొన్న 88% మంది ఏదైనా వ్యాపారం యొక్క వివరాలను తెలుసుకోవడానికి గుగుల్ సర్చ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. దాని సమీక్షలు, రేటింగ్‌లను పరిశీలించారు. వీరిలో 12% మంది మాత్రమే రేటింగ్‌లు తమ నిర్ణయాన్ని 'ఎల్లప్పుడూ' ప్రభావితం చేస్తాయని చెప్పగా, 7% మంది మాత్రం తమ నిర్ణయాలపై గూగుల్ రేటింగులు ఏ మాత్రం ప్రభావం చూపవని తెలిపారు.
గూగుల్ సమీక్షలు, రేటింగుల్లో నకిలీ, తప్పుదారి పట్టించే, అధిక సానుకూల లేదా అధికప్రతికూలంగా ఉండే అవకాశం ఉందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
భారతదేశంలో, పెద్ద సంఖ్యలో వ్యాపారాలు ఆన్‌లైన్ సేవలు అందిస్తాయి. ఈ కంపెనీలు సానుకూల రేటింగ్ లు , సమీక్షలను రూపొందిస్తాయి. వారి పోటీదారులకు వ్యతిరేకంగా ప్రతికూల సమీక్షలను సృష్టిస్తాయి.
ఆన్‌లైన్‌లో ఇలాంటి నకిలీ సమీక్షలు వెల్లువెత్తుతున్న కారణంగా, భారతదేశ జాతీయ ప్రమాణాల సంస్థ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ - గత నెలలో ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు వినియోగదారులను నకిలీ ఆన్‌లైన్ ఉత్పత్తి సమీక్షల నుండి రక్షించడానికి ఉద్దేశించబడ్డాయి.