Telugu Global
National

బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. దీపావ‌ళి నాటికి 5జీ స‌ర్వీసులు

ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ టెలికం రంగంలో ద‌శాబ్ద‌కాలంగా వెన‌క‌బ‌డింది. నిర్వ‌హ‌ణ వ్య‌యం భారీగా పెర‌గ‌డంతో కొన్నేళ్లుగా న‌ష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాల‌జీని చాలా ఆల‌స్యంగా అందుకుంది.

బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. దీపావ‌ళి నాటికి 5జీ స‌ర్వీసులు
X

దేశంలో 5జీ నెట్‌వ‌ర్క్‌ను వేగంగా విస్త‌రించేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీనికోసం వేల సంఖ్య‌లో సెల్‌ఫోన్ ట‌వ‌ర్ల ఏర్పాటు శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌భుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఈ కొత్త టెక్నాల‌జీని త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకొస్తుంద‌ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ ప్ర‌క‌టించారు.

దీపావ‌ళి నాటిక‌ల్లా బీఎస్ఎన్ఎల్ 5జీ

ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ టెలికం రంగంలో ద‌శాబ్ద‌కాలంగా వెన‌క‌బ‌డింది. నిర్వ‌హ‌ణ వ్య‌యం భారీగా పెర‌గ‌డంతో కొన్నేళ్లుగా న‌ష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ 4జీ టెక్నాల‌జీని చాలా ఆల‌స్యంగా అందుకుంది. ఎయిర్‌టెల్‌, జియో, వీఐ వంటి ప్రైవేట్ నెట్‌వ‌ర్క్‌లు 4జీని దేశ‌మంతా విస్త‌రించేశాయి. కానీ, బీఎస్ఎన్ఎల్ గ‌త ఏడాదే 4జీ స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. దీనితో కొత్త‌గా వ‌చ్చిన 5జీ ఇంకెన్నాళ్ల‌కు వ‌స్తుందోన‌న్న అనుమానాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే దీపావ‌ళి నాటికి బీఎస్ఎన్ఎల్ వినియోగ‌దార్ల‌కు కూడా 5జీ స‌ర్వీసులు అందుబాటులోకి తెస్తామ‌ని కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించారు.

4వేల సెల్‌ట‌వ‌ర్లు.. అందులోనూ కోస్తాకే ఎక్కువ‌

దేశ‌మంతా 4వేల సెల్‌ట‌వ‌ర్లు ఏర్పాటు చేస్తున్నామ‌ని కేంద్ర‌మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్ ప్ర‌క‌టించారు. ఇందులో అత్య‌ధికం ద‌క్షిణ కోస్తాలోనే ఉంటాయ‌ని చెప్పారు. ఈ లెక్క‌న ఉత్త‌రాంధ్ర జిల్లాల‌యిన విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల‌కు కొత్త ట‌వ‌ర్ల ఏర్పాటులో ప్రాధాన్యం ద‌క్క‌బోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

First Published:  9 Dec 2023 3:21 PM IST
Next Story