Telugu Global
National

బ్యాంకుల్లోకి కాదు 2వేల కట్టలు గోల్డ్ షాపుల్లోకి వెళ్తున్నాయి..

ప్రత్యేకంగా 2వేల నోట్లు తీసుకొచ్చి బంగారం కొనాలనుకుంటున్న వారికి రేటు ఆటోమేటిక్ గా పెంచేస్తున్నారట వ్యాపారులు. 10 గ్రాములకు దాదాపు 4వేలు తేడా చెబుతున్నారు.

బ్యాంకుల్లోకి కాదు 2వేల కట్టలు గోల్డ్ షాపుల్లోకి వెళ్తున్నాయి..
X

2వేల నోట్లు వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించగానే ఆ నోట్లు తమ వద్ద ఎన్ని ఉన్నాయా అని ఒక్క క్షణం ఆలోచించారంతా. ఒకటీ అరా ఉన్నవారిలో టెన్షన్ లేదు, అదే పనిగా 2వేల నోట్లను దాచుకున్నవారు మాత్రం ఆందోళనకు గురయ్యారు. ఇక బ్లాక్ మనీని పోగేసుకున్నవారిలో ఆ ఆందోళన మరింత ఎక్కువైంది. రాజకీయ నాయకులకు ఆ టెన్షన్ ఎప్పుడూ లేదు. మిగతా వ్యాపార వర్గాలే కాస్త ఇబ్బందిపడే అవకాశముంది. సెప్టెంబర్ 30వరకు బ్యాంకుల్లో డిపాజిట్లకు అవకాశం ఉన్నా కూడా చాలామంది అదంత సేఫ్ కాదు అనుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో 2వేల నోట్లు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను సమస్య కూడా ఉంటుంది. దీంతో చాలామంది ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు.

బంగారం షాపుల్లోకి..

2వేల నోట్లు బ్యాంకుల్లోకి కాకుండా బంగారం షాపుల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. 2వేల నోట్లు కుప్పలు తెప్పలుగా ఉన్న బడాబాబులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రత్యేకంగా 2వేల నోట్లు తీసుకొచ్చి బంగారం కొనాలనుకుంటున్న వారికి రేటు ఆటోమేటిక్ గా పెంచేస్తున్నారట వ్యాపారులు. 10 గ్రాములకు దాదాపు 4వేలు తేడా చెబుతున్నారు. మామూలు కరెన్సీ కానీ, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ కానీ అయితే సాధారణ రేటుకే బంగారం అమ్ముతున్నారు. రేటు ఎక్కువ చెబుతున్నా కూడా.. 2వేల నోటుని వదిలించుకోడానికి చాలామంది గోల్డ్ షాప్ ల వైపు చూస్తున్నారని సమాచారం.

మార్కెట్లోకి డబ్బే డబ్బు..

2వేల నోటుని వెనక్కి తీసుకోవడంలో ప్రభుత్వ టార్గెట్ ఏంటో తెలియదు కానీ.. మార్కెట్లోకి మాత్రం ధన ప్రవాహం పెరిగే అవకాశముంది. దేవాలయాలు, మత సంస్థల ద్వారా కొంతమంది 2వేల నోట్లను మార్పిడి చేసుకోడానికి సిద్ధపడుతున్నారు. మరికొంతమంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా దాచి ఉన్న డబ్బంతా బయటకొస్తుంది కానీ, ప్రభుత్వం అనుకున్న ఫలితం మాత్రం రాదనే అనుమానాలున్నాయి.

First Published:  21 May 2023 1:13 PM IST
Next Story