Gold – Silver Rates | భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.65,700, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71,670 పలికింది.
Gold – Silver Rates | గత నెల రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.2080 వేలు తగ్గింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులకు తోడు దేశీయంగా కేంద్రంలో ప్రధాని మోదీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కాబోతుండటం, గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు ఏడు నుంచి 7.2 శాతానికి పెరుగుతుందని ఆర్బీఐ అంచనా వేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. దీనికి తోడు ప్రస్తుతం పెండ్లిండ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం, వెండి ధరలు తగ్గడం ప్రాధాన్యంగా మారింది. ఇటీవలి కాలంలో బంగారం ధర తగ్గడం ఇదే తొలిసారి. దేశంలో 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.2080 తగ్గి రూ.71,670 వద్ద ముగిసింది. శుక్రవారం రూ.73,750 వద్ద నిలిచింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1900 తగ్గి రూ.65,700 పలికింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1900 పతనమై రూ.65,700 వద్ద నిలిచింది. 24 క్యారట్ల బంగారం ధర రూ.2080 నష్టపోయి రూ.71,670 వద్ద స్థిర పడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీలో వాడే 22 క్యారట్ల బంగారం పది గ్రాముల బంగారం ధర రూ.1900 పడిపోయి రూ.65,850 వద్ద ముగిసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర 66,500 పలికితే, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.72,550 వద్ద స్థిర పడింది.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.65,700, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71,670 పలికింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆభరణాల తయారీ కోసం వాడే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.65,700 వద్ద స్థిర పడితే, 24 క్యారట్ల బంగారం ధర 71,670 వద్ద ముగిసింది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.65,700, 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.71,670 వద్ద ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఆభరణాల తయారీ కోసం వాడే 22 క్యారట్ల బంగారం ధర రూ.65,700, 24 క్యారట్ల బంగారం ధర రూ.71,670 వద్ద ముగిసింది.
మరోవైపు దేశవ్యాప్తంగా సగటున కిలో వెండి ధర రూ.4500 తగ్గింది. శుక్రవారం ఢిల్లీలో రూ.96 వేల వద్ద నిలిచిన కిలో వెండి ధర.. ప్రస్తుతం రూ.91,500 వద్ద నిలిచింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర రూ.4,500 తగ్గి రూ.96 వేల వద్ద తచ్చాడుతున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోనూ 96 వేలు, దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో రూ.91,500, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో రూ.93,350, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ.96 వేలు పలుకుతోంది.