కర్ణాటకలో గోబీ మంచూరియా, పీచుమిఠాయి నిషేధం
చూడడానికి ఆకర్షణీయంగా కనిపించేందుకు వీటిలో వేసే రంగుల్లో రోడమైన బీ అనే ఏజెంట్ ఉంటోందని, అది ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని పీచుమిఠాయితో గోబీ మంచూరియా విక్రయాలను కూడా నిషేధించినట్లు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ ప్రకటించారు.
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల బాటలోనే కర్ణాటక కూడా నడిచింది. కృత్రిమ రంగులు ఉపయోగించి తయారుచేసే పీచుమిఠాయి (కాటన్ క్యాండీ) విక్రయంపై నిషేధం విధించింది. దీంతోపాటు ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్‌తో తయారుచేసే గోబీ మంచూరియానూ బ్యాన్ చేసింది. చూడడానికి ఆకర్షణీయంగా కనిపించేందుకు వీటిలో వేసే రంగుల్లో రోడమైన బీ అనే ఏజెంట్ ఉంటోందని, అది ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరమని పీచుమిఠాయితో గోబీ మంచూరియా విక్రయాలను కూడా నిషేధించినట్లు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ ప్రకటించారు.
కర్ణాటక ఆరోగ్యశాఖాధికారులు ఇటీవల 171 రకాల ఫుడ్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయించారు. ఇందులో 107 శాంపిల్స్‌లో రోడమైన్ బీ, టాట్రజైన్ వంటి హానికరమైన రసాయన అవశేషాలను గుర్తించారు. ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఈ రసాయనాలతో కూడిన ఫుడ్ కలర్స్ వేసి తయారుచేసే ఆహార పదార్ధాల వినియోగాన్ని నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
ఏమిటీ రోడమైన్ బీ?
రోడమైన్ బీ అనేది ఒక కెమికల్ ఏజెంట్, బట్టల తయారీ పరిశ్రమలోనూ, ప్రింటింగ్ ఇండస్ట్రీలోనూ రంగు కోసం వాడతారు. దీన్ని ఇప్పుడు ఫుడ్ కలర్స్‌లోనూవిచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇది పరిమితికి మించి శరీరంలోకి వెళితే కిడ్నీలు, లివర్లు దెబ్బతింటాయి. అందుకే దీన్ని వాడుతున్న ఫుడ్‌ను నిషేధించడానికి ప్రభుత్వాలు శరవేగంంతో కదులుతున్నాయి.