'గెటౌట్ రవి': ట్విట్టర్ లో ట్రెండింగ్...గోడలపై పోస్టర్స్
"#GetOutRavi" అనే హ్యాష్‌ట్యాగ్‌తో చెన్నైలో దర్శనమిచ్చిన పోస్టర్లలో ముఖ్యమంత్రి MK స్టాలిన్, యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో సహా ఇతర ద్రవిడ నేతల చిత్రాలు ఉన్నాయి. ట్వీట్టర్ లో "#GetOutRavi" అనే హ్యాష్‌ట్యాగ్‌ని నంబర్ 1 హ్యాష్‌ట్యాగ్‌గా నిలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ డీఎంకే ఆ పోస్టర్లు వేసింది.
తమిళనాడు అసెంబ్లీ లో ప్రభుత్వం తయారు చేసిన స్పీచ్ ను చదవ నిరాకరించి, తనకిష్టమొచ్చిన రీతిలో మాట్లాడిన గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడటం, గవర్నర్ స్పీచ్ ను రికార్డులనుంచి తొలగించాలని స్పీకర్ ను కోరడంతో అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తమిళనాడులో 'గెటౌట్ రవి' అనే పోస్టర్లు వెలిశాయి. ట్విట్టర్ లో కూడా "#GetOutRavi" హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.
"#GetOutRavi" అనే హ్యాష్‌ట్యాగ్‌తో చెన్నైలో దర్శనమిచ్చిన పోస్టర్లలో ముఖ్యమంత్రి MK స్టాలిన్, యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో సహా ఇతర ద్రవిడ నేతల చిత్రాలు ఉన్నాయి. ట్వీట్టర్ లో "#GetOutRavi" అనే హ్యాష్‌ట్యాగ్‌ని నంబర్ 1 హ్యాష్‌ట్యాగ్‌గా నిలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ డీఎంకే ఆ పోస్టర్లు వేసింది.
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలోని కీలక భాగాలను గవర్నర్ రవి చదవకుండా దాటవేసి, అందులో లేని కొత్త విషయాలను మాట్లాడటంతో రవి, స్టాలిన్ మధ్య విభేదాలు తలెత్తాయి. గవర్నర్ ప్రసంగం కోసం తయారు చేసిన పాఠాన్ని మాత్రమే చెల్లుబాటు అయ్యేలా ప్రకటించాలని, అసెంబ్లీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారనే కారణంతో రవికి వ్యతిరేకంగా స్టాలిన్ శాసన సభలో తీర్మానం ప్రతిపాదించారు. రవి తన ప్రసంగంలో అంబేద్కర్, ద్రావిడ నాయకులు, ద్రావిడ పాలనా నమూనా, తమిళనాడులో శాంతిభద్రతల ప్రస్తావనలతో కూడిన మూడు భాగాలను విస్మరించడాన్ని డిఎంకె ప్రభుత్వం ఖండించింది. అసెంబ్లీలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించారు. దాంతో సెషన్ ముగియడానికి ముందే గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు.
గవర్నర్, ప్రభుత్వానికి మధ్య కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతోంది, గత వారం రవి "తమిళనాడు" కంటే "తమిళగం" అనే పేరు సముచితంగా ఉంటుందని సూచించడంతో ఇటీవల వివాదం రేగింది.
సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు మద్దతు తెలుపుతూ, గవర్నర్ ‘గెట్ అవుట్’ అంటూ పిలుపునిస్తూ, హ్యాష్‌ట్యాగ్‌లు, సోషల్ మీడియాలో మెసేజ్ లు వెల్లువెత్తాయి.
From social media to city walls #GetOutRavi is everywhere! pic.twitter.com/k1sdKYCEaV
— இசை (@isai_) January 10, 2023