Telugu Global
National

"మోడీని చంపడానికి సిద్ధంగా ఉండండి...": కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యల వివాదం

కాంగ్రెస్ నేత పటేరియా ఓ సభలో మాట్లాడుతూ ''మోడీ ఎన్నికలు లేకుండా చేస్తారు. మతం, కులం, భాష ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే..మోడీని చంప‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాలి'' అని అన్నారు.

మోడీని చంపడానికి సిద్ధంగా ఉండండి...: కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యల వివాదం
X

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాజా పటేరియా వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌వుతున్నాయి. ఆయ‌న చేసిన ఓ ప్ర‌సంగం వీడియో వైర‌ల్ గా మారింది. ఆ వీడియోలో ఆయ‌న " రాజ్యాంగాన్ని కాపాడాలంటే ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాలి" అన‌డం వినినిపించింది. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై బిజెపి నేత‌లు మ‌ద్ద‌తుదారులు మండిప‌డుతున్నారు ఆయనను అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ప‌టారియా వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీ నిజ‌స్వ‌రూపాన్ని బ‌య‌ట‌పెట్టాయ‌ని విమ‌ర్శిస్తున్నారు.

త‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ప‌టారియా వివ‌ర‌ణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను అపార్ధం చేసుకున్నార‌ని, చంప‌డం అంటే ఎన్నిక‌ల్లో ఓడించ‌డం అనే త‌న భావ‌న అని పేర్కొన్నారు.

రాష్ట్ర హోంమంత్రి ఈ వీడియోపై స్పందిస్తూ.. ప‌టారియాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు, "భారత్ జోడో యాత్ర" చేస్తున్నట్లు నటిస్తున్న వారి అసలు కోణం బయటకు వస్తోంది" అని అన్నారు.

పటేరియా ఓ సభలో మాట్లాడుతూ ''మోడీ ఎన్నికలు లేకుండా చేస్తారు. మతం, కులం, భాష ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే..మోడీని చంప‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాలి'' అని చెప్పడం వీడియోలో కనిపించింది.

ఈ వివాదం త‌ర్వాత రాజా పటేరియా స్పంద‌స్తూ.. తన ప్రసంగంలో " 'హత్య' అనే పదానికి ఓటమి అని అర్థం. తాను మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నానని, మైనారిటీల రక్షణ కోసం ప్రధాని మోడీని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉందని " ఆయన అన్నారుకాంగ్రెస్ నేత పటేరియా ఓ సభలో మాట్లాడుతూ ''మోడీ ఎన్నికలు లేకుండా చేస్తారు. మతం, కులం, భాష ప్రాతిపదికన దేశాన్ని విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే..మోడీని చంప‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉండాలి'' అని అన్నారు.


First Published:  12 Dec 2022 2:47 PM IST
Next Story