నరేంద్ర దామోదర్ దాస్ టీవీ (ఎన్డీటీవీ).. హోరెత్తిపోతున్న సోషల్ మీడియా..
అదానీ న్యూస్ ఛానల్ అంటే అందులో ఎవరి భజన జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఎవరిని కీర్తిస్తారో, ఎవరిని భుజానికెత్తుకుని మోస్తారో, ఎవరి వార్తలకు ప్రయారిటీ పెరుగుతుందో వివరించాల్సిన పనిలేదు.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది హాట్ టాపిక్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. గౌతమ్ అదానీ ఎన్డీటీవీ షేర్లు కొనడంతో సోషల్ మీడియాలో అది హాట్ టాపిక్ అయింది. ఒకవేళ ట్రెండింగ్ లోకి వస్తే #NDTV అనే పదం హైలెట్ కావాలి. కానీ అనూహ్యంగా #NARENDRADAMODARDASTV అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. నిన్న మొన్నటి వరకూ గోదీ మీడియా అంటున్నవారంతా ఇప్పుడు ఎన్డీటీవీ అనబోతున్నారనమాట.
అదానీ న్యూస్ ఛానల్ అంటే అందులో ఎవరి భజన జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఎవరిని కీర్తిస్తారో, ఎవరిని భుజానికెత్తుకుని మోస్తారో, ఎవరి వార్తలకు ప్రయారిటీ పెరుగుతుందో వివరించాల్సిన పనిలేదు. ఇన్నాళ్లూ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ గా ఉన్న NDTV ఇకపై నరేంద్ర దామోదర్ దాస్ టీవీ (NDTV) కాబోతోందని సెటైర్లు పడుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ సృష్టిస్తున్నారు. మోదీని ఓ ఆటాడేసుకుంటున్నారు. అదానీ ఎన్డీటీవీ షేర్లు కొనడం చివరకు మోదీకి తలంటుగా మారింది.
ఎన్నికల ముందస్తు వ్యూహాలేనా..?
2014 ఎన్నికల్లో సోషల్ మీడియాని ఓ రేంజ్ లో వాడుకున్నారు మోదీ. 2019లో కూడా అదే జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాని వాడుకోవడం అందరికీ అలవాటైపోయింది. పోనీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమైనా నిష్పక్షపాతంగా ఉందా అంటే అదీ లేదు. ఎవరి పార్టీ వారిది, ఎవరి స్ట్రాటజీ వారిది, ఎవరి విశ్లేషణ వారిది. ఆఖరికి ఎన్నికల ఫలితాలను కూదా స్ట్రైట్ గా చెప్పట్లేదు. ఫలానా పార్టీకి సీట్లు ఎక్కువ వచ్చాయంటే, ఫలానా పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని ఇంకొకరు అంటారు. ఇలా ఎవరికి కావాల్సిన వారిని వారు హైలెట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఎన్డీటీవీకి ఇక చేతినిండా పని ఉంది అంటున్నారు నెటిజన్లు. గతంలో ఎన్డీటీవీ రిపోర్టర్లు, బీజేపీ నేతల్ని ఇంటర్వ్యూ చేసిన వీడియోల స్క్రీన్ షాట్లను తీసి మీమ్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈమీమ్స్ అన్నిటికీ కామన్ గా #NARENDRADAMODARDASTV అనే హ్యాష్ ట్యాగ్ జత చేస్తున్నారు. నరేంద్ర మోదీ అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అందుకే ఇప్పుడు ఎన్డీటీవీ కాస్తా నరేంద్ర దామోదర్ దాస్ టీవీగా మారిపోయిందనమాట.