Telugu Global
National

బిజెపిలో చేర‌నందుకే గంగూలీని ప‌ద‌వినుంచి తొల‌గించారు : తృణ‌మూల్ కాంగ్రెస్

సౌరవ్ గంగూలీ బీజేపీ లో చేరనందుకే ఆయనకు బీసీసీఐ అధ్యక్షుడిగా రెండవ‌సారి అవకాశం ఇవ్వలేదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బెంగాల్ లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా గంగూలి బిజెపి లో చేర‌తార‌నే విప‌రీత‌ప్ర‌చారాన్ని ఆ పార్టీ చేసిందని, ఆయన చేరకపోయేసరికి పక్కనపెట్టేశారని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.

బిజెపిలో చేర‌నందుకే గంగూలీని ప‌ద‌వినుంచి తొల‌గించారు : తృణ‌మూల్ కాంగ్రెస్
X

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గంగూలీకి రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి ఇవ్వకుండా బీజేపీ అవమానపరిచింద‌ని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఆరోపించింది. గంగూలీని పార్టీలో చేర్చుకోవడంలో విప‌ల‌మైన బిజెపి ఆయనను పదవినుంచి తొల‌గించారని పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా గ‌త యేడాది అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన గంగూలి బిజెపి లో చేర‌తార‌నే విప‌రీత‌ప్ర‌చారాన్ని చేసింద‌ని తృణమూల్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.

ఘోష్ మాట్లాడుతూ, " ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల తర్వాత బిజెపి అటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది కాబట్టి, గంగూలీ రెండవసారి బిసిసిఐ చీఫ్‌గా రాకపోవడం వెనుక రాజకీయం ఉంద‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. దీనిపై ఖ‌చ్చితంగా బిజెపికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సౌరవ్‌ను కించపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అర్ధ‌మ‌వుతోంది. " అన్నారు.

ఈ సారి బీసీసీఐ కార్యదర్శిగా హోంమంత్రి అమిత్ షా తనయుడు జే షా కొనసాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇత‌ర కీల‌క ప‌ద‌వుల్లో కూడా బిజెపి స‌భ్యులు, ఆపార్టీకి సంబంధం ఉన్న‌వారే . అయితే సౌరవ్ గంగూలీని బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించ‌డం 'రాజకీయ ప్రతీకారం'లో భాగమేనని టీఎంసీ పేర్కొంది.

కాగా, టిఎంసి చేసిన ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది. సౌరవ్ గంగూలీని పార్టీలో చేర్చుకోవడానికి తాము ఎప్పుడూ ప్రయత్నించలేదని పేర్కొంది. భారత మాజీ కెప్టెన్‌ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న పుకార్లు నిరాధారమైనవని స్పష్టం చేసింది.

First Published:  12 Oct 2022 5:51 AM GMT
Next Story