బెంగాల్ లో మళ్ళీ 'ఆట' మొదలు..ముందస్తు సూచనలా..!?
రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొన్నేళ్లలో గద్దె దిగిపోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను’ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను సూచిస్తూ, "2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఆయన అన్నారు.
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గత ఎన్నికల్లో ఇచ్చిన 'ఖేలా హోబే' (ఆట మొదలైంది)అనే నినాదం బాగా పని చేసింది.
ఇప్పుడు అదే నినాదాన్ని ఆమెపైనే ప్రయోగించాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.ఇక రాబోయే ఎన్నికల్లో ఇద్దరూ 'ఆట' ఆడతారని బిజెపి పేర్కొంది. "ఖేలా హోబే" - రెండు పార్టీలు ఆడతాయి. ఇది ప్రమాదకరమైనది" అని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. శుక్రవారం నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బరాక్‌పూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో మజుందార్ మాట్లాడుతూ..బిజెపి అహింసను నమ్ముతుందని, అలాగని ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోదని అన్నారు.
2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ "ఖేలా హోబే" అనే నినాదాన్ని రూపొందించింది. అది విపరీతమైన ప్రజాదరణ పొందింది. పశ్చిమ బెంగాల్ వెలుపల కూడా అనేక ఇతర పార్టీలు కూడా ఈ నినాదాన్ని ఉపయోగించుకున్నాయి.
రాష్ట్రంలోని ఆస్తులను అమ్మేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొన్నేళ్లలో గద్దె దిగిపోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను' అని మజుందార్ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను సూచిస్తూ, "2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఆయన అన్నారు.
2021 ఎన్నికల తర్వాత జరిగిన హింసకు సంబంధించిన కేసుల్లో సుమారు 300 మంది టిఎంసి కార్యకర్తలు జైలులో ఉన్నారని, వీటిని సిబిఐ దర్యాప్తు చేస్తున్నదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత మందిని చట్టం ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని మజుందార్ అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారెవరైనా, వారు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే , ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నంత వరకు తప్పించుకోలేరన్నారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీ కి కొమ్ము కాస్తోందని విమర్శించారు. పోలీసు యంత్రాంగం తటస్థంగా ఉండేలా లోక్‌సభలో బిల్లు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.