Telugu Global
National

ఆస్కార్ కు RRR ను ఎంపిక చేయకపోవడంపై FWICE అభ్యంత‌రం

భారత్ నుంచి ఆస్కార్ కు అధికారిక షోగా RRR, కశ్మీర్ ఫైల్స్ వంటి మూవీలను కాకుండా 'ఛలో షో'ను పంపడంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేసింది.

ఆస్కార్ కు RRR ను ఎంపిక చేయకపోవడంపై FWICE అభ్యంత‌రం
X

ఆస్కార్‌కి భారత అధికారిక ఎంట్రీగా ఛలో షోను పంపాలని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఆర్ఆర్ఆర్‌, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాల అభిమానులతో సహా పలువురు ఛలో షోను భారతదేశ అధికారిక ఎంట్రీగా ఆస్కార్ కు ఎంపిక చేయడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ) తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేసింది. అస‌లు ఛెలో షో భారతీయ చిత్రం కూడా కాదని ఆరోపించింది.

ఛెలో షో, ఆంగ్లంలో లాస్ట్ ఫిల్మ్ షోగా విడుదలైంది. ఇది పాన్ నలిన్ దర్శకత్వం వహించిన గుజరాతీ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా. ఇది ఒక విదేశీ చిత్రం. 95వ అకాడమీ అవార్డ్స్‌లో భార‌త్ త‌ర‌పున‌ ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా పంపేందుకు అర్హ‌త లేదు అని FWICE పేర్కొంది.

FWICE అధ్య‌క్షుడు బిఎన్ తివారీ మాట్లాడుతూ, "ఈ చిత్రం భారతీయ చిత్రం కాదు. ఎంపిక ప్రక్రియ సరైనది కాదు. RRR, కాశ్మీర్ ఫైల్స్ వంటి అనేక భారతీయ చిత్రాలు ఉన్నాయి, కానీ జ్యూరీ సిద్ధార్థ్ రాయ్ కపూర్ కొనుగోలు చేసిన విదేశీ చిత్రాన్ని ఎంపిక చేసింది." అని విమ‌ర్శించారు. జ్యూరీ త‌న నిర్ణ‌యాన్ని పున‌రాలోచించుకోవాలి. తిరిగి చిత్రాల‌ ఎంపిక‌ను చేప‌ట్టాలి. జ్యూరీ స‌భ్యుల్లో కొంత‌మంది చిత్రాల‌ను కూడా చూడ‌కుండానే ఓటింగ్ లో పాల్గొంటారు. ఈ జ్యూరీ లో స‌భ్యులు చాలా కాలంగా కొన‌సాగుతున్నారు. అందువ‌ల్ల జ్యూరీని ర‌ద్దు చేయాల‌ని" తివారీ డిమాండ్ చేశారు.

First Published:  23 Sept 2022 7:40 PM IST
Next Story