Telugu Global
National

రాజ్యసభలో అయోమయానికి గురైన మాజీ ప్రధాని దేవెగౌడ

కర్నాటకలోని మైసూర్ ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్యపై మాట్లాడారు. అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు తమిళనాడుకు చెందిన వైగో అభ్యంతరం తెలిపారు. కానీ అవేవీ పట్టించుకోకుండా దేవెగౌడ మాట్లాడుతూ ఉండిపోయారు.

రాజ్యసభలో అయోమయానికి గురైన మాజీ ప్రధాని దేవెగౌడ
X

మాజీ ప్రధాని దేవెగౌడ రాజ్యసభలో అయోమయానికి గురయ్యారు. చివరకు ఆయన ప్రసంగం కొనసాగిస్తుండగానే చైర్మన్‌ మైక్ కట్ చేయాల్సి వచ్చింది. 90ఏళ్లు సమీపించిన దేవెగౌడ ఇప్పటికీ క్రమం తప్పకుండా సభకు హాజరువుతుంటారు.

శుక్రవారం జీరో అవర్‌లో మాట్లాడాల్సిందిగా దేవెగౌడను చైర్మన్ జగదీప్‌ ధన్‌క‌ర్ కోరారు.. అలా మూడు సార్లు పేరు పిలిచినా దేవెగౌడ్ వినిపించుకోలేదు. చివరకు దేవెగౌడ్‌కు చెప్పాల్సిందిగా పక్కనున్న సభ్యులకు చైర్మన్ సూచించారు. పక్కనున్న సభ్యులు తట్టి చెప్పడంతో మాజీ ప్రధాని.. తాను నిలబడి మాట్లాడే పరిస్థితి లేదని కూర్చునే ప్రసంగిస్తానని అనుమతి తీసుకున్నారు.

ఆ తర్వాత కర్నాటకలోని మైసూర్ ప్రాంతంలో నీటి ఎద్దడి సమస్యపై మాట్లాడారు. అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు తమిళనాడుకు చెందిన వైగో అభ్యంతరం తెలిపారు. కానీ అవేవీ పట్టించుకోకుండా దేవెగౌడ మాట్లాడుతూ ఉండిపోయారు. చాలాసేపు మాట్లాడుతూ ఉండడంతో ముగించాల్సిందిగా పదేపదే చైర్మన్ కోరారు. కానీ దేవెగౌడ వినిపించుకోలేదు.

దాంతో మైక్ కట్ చేసిన చైర్మన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఆ తర్వాత కూడా దేవెగౌడ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి తర్వాత విషయం గ్రహించిన దేవెగౌడ తన ప్రసంగాన్ని ఆపేశారు. దేవెగౌడ పరిస్థితిని సభ్యులుగా ఆసక్తిగా గమనిస్తూ ఉండిపోయారు.

First Published:  10 Dec 2022 2:56 AM GMT
Next Story