Telugu Global
National

కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం లో కీలకమైన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసిన వ్యక్తి అదే కాంగ్రెస్ లో చేరడం, తమ ప్రభుత్వాన్ని కూల్చేసిన వ్యక్తిని కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకోవడం... గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వ్యక్తి ఈ సారి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం, గత ఎన్నికల్లో ఆయనపై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వ్యక్తి ఈ సారి బీజేపీ తరపున పోటీ చేయడం....ఇవే కదా రాజకీయాలంటే!

కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం లో కీలకమైన నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు
X

,ఆయన‌ పేరు లక్ష్మణ్ సవాది, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'అథని' నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేష్ కుమతహల్లి చేతిలో ఓడి పోయారు.

2019 లో కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తీసుకరావడానికి కృషి చేసిన కీలకమైన వ్యక్తుల్లో లక్ష్మణ్ సవాది ఒకరు. కాంగ్రెస్, జేడీఎస్ ల ప్రభుత్వాన్ని కూల్చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లక్ష్మణ్ సవాది చివరకు తనపై గెలిచిన మహేష్ కుమతహల్లిని కూడా బీజేపీ లో చేర్పించారు. అనంతరం సవాది ఎమ్మెల్సీ అయ్యారు. బీజేపీ సర్కార్ లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.

ఇప్పుడంతా తలకిందులైంది. తన స్వంత నియోజకవర్గం అథనిలో సవాదికి టిక‌ట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం తిరస్కరించింది. కాంగ్రెస్ లోనుండి బీజేపీలో చేరిన మహేష్ కుమతహల్లికి టిక్కట్ ఇచ్చింది.

దాంతో ఆయన బీజేపీపై తిరుగుబాటు చేశారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సవాది, శుక్రవారం బెంగళూరులోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత‌ సిద్ధరామయ్యలతో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆయనకు 'అథని' నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ టికట్ కూడా కన్ఫర్మ్ అయ్యింది.

"అతను తన ఇష్టానుసారం మా (కాంగ్రెస్) కుటుంబంలో సభ్యుడయ్యేందుకు అంగీకరించాడు" అని డీకే శివకుమార్ విలేకరులతో అన్నారు. సవాది శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.

సవాడి, శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టిని కలుస్తారని, ఈరోజు ఎగువసభకు రాజీనామా చేస్తారని, ఆ తర్వాత అధికారికంగా కాంగ్రెస్‌లో చేరతారని శివకుమార్ తెలిపారు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని అనడానికి కారణం ఇలాంటి సంఘటనలే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసిన వ్యక్తి అదే కాంగ్రెస్ లో చేరడం, తమ ప్రభుత్వాన్ని కూల్చేసిన వ్యక్తిని కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకోవడం... గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వ్యక్తి ఈ సారి కాంగ్రెస్ తరపున పోటీ చేయడం, గత ఎన్నికల్లో ఆయనపై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వ్యక్తి ఈ సారి బీజేపీ తరపున పోటీ చేయడం....ఇవే కదా రాజకీయాలంటే!

First Published:  14 April 2023 3:26 PM IST
Next Story