ఇప్పటి వరకు పార్లమెంటులో నోరు విప్పని రాజ్యసభ సభ్యుడు, మాజీ సీజేఐ రంజన్ గొగోయ్
అతను ఎంపీ అయినప్పటి నుండి పార్లమెంటరీ కార్యకలాపాలపై కానీ పార్లమెంటుకు హాజరు కావడంపై కానీ పెద్దగా ఆసక్తి చూపలేదు. పాలసీ రీసర్చ్ స్టడీస్ (PRS) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం, అతని హాజరు కేవలం 30% వద్ద ఉంది.
పదవీ విరమణ చేసిన వెంటనే 2020 మార్చిలో రాజ్యసభకు నామినేట్ అయిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఇప్పటివరకు పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అతను ఏ ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టలేదు. " అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
అతను ఎంపీ అయినప్పటి నుండి పార్లమెంటరీ కార్యకలాపాలపై కానీ పార్లమెంటుకు హాజరు కావడంపై కానీ పెద్దగా ఆసక్తి చూపలేదు. పాలసీ రీసర్చ్ స్టడీస్ (PRS) లెజిస్లేటివ్ రీసెర్చ్ ప్రకారం అతని హాజరు కేవలం 30% వద్ద ఉంది.
మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా బాబ్రీ మసీదు భూ తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం గొగోయ్ ని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసినప్పుడు అనేక విమర్శలు వచ్చాయి. ఆసమయంలో గొగోయ్ మాట్లాడుతూ, "న్యాయ వ్యవస్థల అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం కోసం తాను పార్లమెంటులో ప్రవేశిస్తున్నాను. ”. అన్నారు.
2021లో, NDTV ఇంటర్వ్యూలో తన హాజరు తక్కువగా ఉందని అడిగినప్పుడు, గొగోయ్ ఇలా అన్నారు, “నాకు అనిపించినప్పుడు, నేను మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయని నేను భావించినప్పుడు రాజ్యసభకు వెళ్తాను. నేను నామినేటెడ్ సభ్యుడిని, ఏ పార్టీ విప్ పాటించాల్సిన అవసరం నాకు లేదు. అందువల్ల, పార్టీ సభ్యులు రావాలని గంట మోగించినప్పుడల్లా వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు.'' అన్నారు
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఆయనకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్‌లు సమర్పించారు.
అయోధ్య కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పిన మరో న్యాయమూర్తి - జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇదే తీర్పులో భాగమైన మరో న్యాయమూర్తి అశోక్ భూషణ్ 'నేషనల్ కంపనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్' కు చైర్మన్ గా నియమించబడ్డారు.