Telugu Global
National

భారత్ లో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్

ఈ పోస్ట్ ఆఫీస్ నిర్మాణానికి 23 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఐఐటీ మద్రాస్ సాంకేతిక సహకారంతో ఎల్ అండ్ టి సంస్థ ఈ పోస్టాఫీస్ నిర్మించింది.

భారత్ లో మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్
X

భారత దేశంలో మొట్ట మొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని బెంగళూరులో ప్రారంభించారు. ఉల్సూరు దగ్గర్లోని కేం బ్రిడ్జ్ లే అవుట్ లో ఈ పోస్ట్ ఆఫీస్ ని ఏర్పాటు చేశారు. 3D ప్రింటెడ్ టెక్నాలజీతో లేయర్ల ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. క్విక్ సెట్టింగ్ మెటీరియల్ తో నిర్మించారు. 1021 చదరపు అడుగుల విస్తీర్ణంలో 43 రోజుల్లో ఈ పోస్టాఫీస్ నిర్మాణం పూర్తయింది. మొత్తం ఈ ప్రక్రియకు 10నెలలు సమయం పట్టింది.

నిర్మాణ వ్యయం.. రూ. 23లక్షలు

ఈ పోస్ట్ ఆఫీస్ నిర్మాణానికి 23 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఐఐటీ మద్రాస్ సాంకేతిక సహకారంతో ఎల్ అండ్ టి సంస్థ ఈ పోస్టాఫీస్ నిర్మించింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీతో అక్కడక్కడ చిన్న చిన్న ఇళ్లను కూడా నిర్మిస్తున్నారు. అయితే ప్రభుత్వ అధీనంలోని నిర్మాణాలకు ఇలా 3D టెక్నాలజీ వాడటం ఇదే మొదటి సారి. ఈ టెక్నాలజీతో నిర్మితమైన తొలి పోస్ట్ ఆఫీస్ ఉన్న నగరంగా బెంగళూరు రికార్డులకెక్కింది.


రాజకీయ అలజడి..

పోస్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే కర్నాటకలో స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కనీసం సమాచారం కూడా లేదు. స్థానిక ఎమ్మెల్యేకి కూడా ఆహ్వానం లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పోస్ట్ ఆఫీస్ ప్రారంభోత్సవం రోజు నల్ల దుస్తుల్లో వచ్చి నిరసన తెలిపారు. రాజకీయ ఆందోళనలతో ఈ కార్యక్రమానికి మరింత ప్రచారం లభించినట్టయింది.

First Published:  19 Aug 2023 1:19 PM IST
Next Story